శనివారం 26 సెప్టెంబర్ 2020
Health - Aug 03, 2020 , 16:48:02

ఒబిసిటీ ఉన్న‌వారికే క‌రోనా సోకే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ట‌!

ఒబిసిటీ ఉన్న‌వారికే క‌రోనా సోకే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ట‌!

క‌రోనాకు ఒబిసిటీకి అస‌లు పొత్తుపోదంట‌. అదేంటి గిట్ట‌న‌ప్పుడు క‌రోనా వీరి జోలికి రాకూడ‌దు అనుకుంటున్నారా? ఈ క‌రోనా గిట్ట‌ని వాళ్ల‌కే సోకుతుంది. ఊబ‌కాయంతో బాధ‌ప‌డేవారు క‌రోనా సోకితే చ‌నిపోయే ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉన్న‌ట్లు బ్రిట‌న్ ఆరోగ్యశాఖ స‌హాయ‌మంత్రి హెచ్చ‌రించారు. కాబ‌ట్టి బ‌రువు త‌క్కువ‌గా ఉండేవారికి క‌రోనా సోకే ల‌క్ష‌ణాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని బ్రిట‌న్ ప్ర‌జ‌లు త‌గ్గే ప‌నిలో ఉన్నార‌ట‌. 

* క‌రోనా బారిన ప‌డ‌కుండా త‌ప్పించుకోవాలంటే కొన్నిసార్లు ప‌స్తులున్నా తప్పులేదంటున్నారు. శ‌రీర జీవ‌క్రియ‌, రోగ‌నిరోధ‌క శ‌క్తి వ్య‌వ‌స్థ‌ను అనుసంధానించే హార్మోన్‌కు మెట‌బాలిజానికి లింక్ ఉంది. అందువ‌ల్ల‌నే వీరికి క‌రోనా వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు. 

* ఊబ‌కాయంతో బాధ‌ప‌డేవారిలో లెప్టిన్ స్థాయిలు ఎక్కువ‌గా ఉంటాయి. ఊపిరితిత్తులు, అంటువ్యాధుల‌తో ఎలివేటెడ్ లెప్టిన్ స్థాయిలు శ‌రీర సామ‌ర్థ్యాన్ని దెబ్బ‌తీస్తాయి. 

* లెప్టిన్ అనేది హార్మోన్‌. ఇది ఆక‌లి, జీర్ణ‌క్రియ‌ను నియంత్రిస్తుంది. శ‌రీరంలో కొవ్వు అధికంగా ఉంటే లెప్టిన్ కూడా ఎక్కువ‌గా ఉన్న‌ట్లే.  

* లెప్టింగ్ స్థాయిలు పెరిగితే బ‌రువు పెర‌గ‌డ‌మే కాదు రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌గ్గుతుంది. దీంతోపాటు శ‌రీరం ఎర్ర‌బ‌డుతుంది. అంతేకాదు ఊపిరితిత్తుల సామ‌ర్థ్యం కూడా దెబ్బ‌తింటుంద‌ని ఇంట‌ర్నేష‌న‌ల్ జ‌ర్న‌ల్ ఆఫ్ ఒబిసిటీ అధ్య‌‌య‌నంలో తేలింది. 

* అందుకే క‌రోనాతో పోరాడాలి అనుకునేవారు ఊబ‌కాయం స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాలి. ఊబ‌కాయం ఉంటే ఒక్క క‌రోనానే కాకుండా మ‌రిన్ని ఆనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌డం కూడా ఖాయం. 

 


logo