మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Health - Jul 27, 2020 , 13:12:32

హోంమేడ్‌ ద‌‌గ్గు, జ‌లుబు సిర‌ప్!

హోంమేడ్‌ ద‌‌గ్గు, జ‌లుబు సిర‌ప్!

సాధార‌ణంగా జ‌లుబు, ద‌గ్గు వ‌స్తే త‌గ్గిపోత‌దిలే అని ప‌నులు చేసుకుంటూ వెళ్లిపోతాం. క‌రోనా నేప‌థ్యంలో అంత నిర్ల‌క్ష్యంగా ఉంటే క్వారెంటైన్‌కు త‌ర‌లిస్తారు. అలా అని మెడిసిన వేసుకొని త‌గ్గించుకోవాల్సిన అవ‌స‌రం అంత క‌న్నా లేదు. ఇంట్లోనే, కిచెన్‌లో దొరికే కొన్ని ఇంగ్రీడియంట్స్‌తోనే ఔష‌ధం త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌రి అవేంటో, ఎలా చేసుకోవాలో చూసేద్దాం.

సిర‌ప్‌కు కావాల్సిన ప‌దార్థాలు :

నీళ్ళు : ఒక కప్పు

వాము ఆకులు : 4 నుండి 5

తులసి ఆకులు : 5 నుండి 6

పసుపు : చిటికెడు

అల్లం రసం : ముప్పావు టీస్పూన్

నిమ్మరసం : ఒక టీస్పూన్

తేనె : ఒక టీస్పూన్

త‌యారీ :

ముందుగా ఒక పాన్ తీసుకొని, అందులో ఒక కప్పు నీరు పోసి మరిగించంచాలి. నీరు వేడిక్కిన త‌ర్వాత ఐదు వాము ఆకులు వేయాలి. ఇందులోనే చిటికెడు ప‌సుపు వేసుకోవాలి. ఆ త‌ర్వాత ఆరు తుల‌సి ఆకులు కూడా వేయాలి. ఈ మిశ్ర‌మాన్ని 8 నిమిషాల పాటు ఉడికించాలి. సువాస‌న వ‌చ్చేంత వ‌ర‌కు మిశ్ర‌మాన్ని మ‌ర‌గ‌నివ్వాలి. త‌ర్వాత ప‌క్క‌న పెట్టి చ‌ల్లార్చుకోవాలి. త‌ర్వాత వేరే బౌల్‌లోకి మార్చుకోవాలి. ఇప్పుడు అల్లం ర‌సం, నిమ్మ‌ర‌సం, తేనె జోడించి ప‌దార్థాల‌న్ని బాగా క‌ల‌పాలి. ఈ సిర‌ప్ గోరువెచ్చ‌గా ఉన్న‌ప్పుడు ఒక క‌ప్పులోకి తీసుకొని సేవిస్తే రోగాల‌న్నీ మ‌టుమాయం అయిపోతాయి. ఇక అంతే హోం మేడ్ సిర‌ప్ రెడీ అయిపోయిన‌ట్లే! ప్ర‌తిరోజూ ఈసిర‌ప్‌ను 10 మి.లీ. వ‌ర‌కు ఇవ్వొచ్చు. పెద్ద‌వాళ్లు అయితే అర‌క‌ప్పు నుంచి ఒక క‌ప్పు వ‌ర‌కు సేవించ‌డం మంచిది.    

ఉప‌యోగాలు :

* వాము ఆకులను డైరెక్టుగా  నమలడం వల్ల కూడా తొందరగా జలుబు నుంచి బయట ప‌డ‌వ‌చ్చు. 

* పసుపు, శ్వాసకోశంలో ఉండిపోయిన కఫాన్ని తొలగిస్తుంది. అంతేకాకుండా యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేసి, జలుబు, దగ్గు నుండి ఉపశమనాన్ని ఇస్తుంది.

* తులసి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

* అల్లం కఫాన్ని తగ్గించడంలో, శ్వాస సజావుగా సాగడంలో సహాయం చేస్తుంది. అదేవిధంగా బ్యాక్టీరియాను చంపుతుంది. logo