శుక్రవారం 30 అక్టోబర్ 2020
Health - Sep 26, 2020 , 15:17:05

ప్రెగ్నెన్సీ టైంలో దుర‌ద ఎక్కువ‌గా ఉంటుందా? స‌హ‌జ ప‌ద్ద‌తిలోనే నివార‌ణ‌

ప్రెగ్నెన్సీ టైంలో దుర‌ద ఎక్కువ‌గా ఉంటుందా? స‌హ‌జ ప‌ద్ద‌తిలోనే నివార‌ణ‌

గ‌ర్భం దాల్చిన త‌ర్వాత మ‌హిళ‌లు ఎన్నో స‌మ‌స్య‌ల‌కు గుర‌వుతుంటారు. వాటిని ప‌రిష్క‌రించుకుంటూ ముందుకు వ‌స్తేనే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. వీటిలో కొన్ని స‌మ‌స్య‌లు త‌ర్వాత కూడా వెంటాడుతుంటాయి. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైంలో పొట్ట ప్ర‌దేశంలో ఎక్కువ‌గా దుర‌ద పెడుతుంటుంది. దుర‌ద‌ను పోగొట్టుకోవ‌డానికి గీర‌డం వ‌ల్ల పొట్ట మీద మ‌చ్చ‌లు, చార‌లు ప‌డుతాయి. అవి డెలివ‌రీ త‌ర్వాత కూడా అలానే ఉండిపోతాయి. అందుక‌ని ఎట్టి ప‌రిస్థితుల్లో పొట్ట మీద గీర‌కూడ‌ద‌ని వైద్యులు చెబుతుంటారు. అందుకే స‌హ‌జ ప‌ద్ద‌తిలోనే దుర‌ద‌ను మాయం చేసుకోవ‌చ్చు. అదెలాగంటే.. 

వోట్మీల్ బాత్ 

ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని నీరు తీసుకోవాలి. వీటిలో ఒక క‌ప్పు వోట్మీల్ వేసి 20 నిమిషాల పాటు నాన‌బెట్టాలి. త‌ర్వాత వీటిని తీసి వ‌స్త్రంలో క‌ట్టాలి. దీనిని దుర‌ద పెట్టే ప్ర‌దేశంలో అటూ క‌దిలిస్తూ పెడుతుంటే ఫ‌లితం ఉంటుంది. ఇలా త‌ర‌చూ చేస్తే మంచిది.   

కొబ్బరి నూనె 

కొబ్బ‌రినూనెను చేతిలో వేసుకొని దుర‌ద ఉండే ప్ర‌దేశంలో మ‌సాజ్ చేస్తూ ఉండాలి. ఇలా రాత్రిపూట 40 నిమిషాల‌పాటు చేస్తే దుర‌ద నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు. కొబ్బరి నూనెలో యాంటీ ఇన్ల్ఫ‌మేట‌రీ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మం దురదకు సహాయపడతాయి. 

అలోవెరా జెల్ 

అలోవెరా జెల‌ను దుర‌ద‌గా ఉండే ప్ర‌దేశం అంటే క‌డుపు మీద అప్లై చేయాలి. 30 నిమిషాల త‌ర్వాత నీటితో శుభ్రం చేసి బ‌ట్ట‌తో తుడిచేయాలి. ఇలా ప్ర‌తిరోజూ రెండుసార్లు చేస్తే మంచిది. అలోవెరా జెల్ దురద నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడతాయి.

బేకింగ్ సోడా బాత్

స్నానం చేసే ట‌బ్‌లో ఒక క‌ప్పు బేకింగ్ సోడా క‌లుపాలి. 20 నిమిషాలు అలానే నాన‌బెట్టి స్నానం చేయాలి. త‌ర్వాత చ‌ర్మాన్ని త‌డి లేకుండా తుడుచుకోవాలి. ఇలా చేస్తే చ‌ర్మం దుర‌ద‌కు గుర‌వ‌కుండా ఉంటుంది. 

జునిపెర్ ఆయిల్ 

30 ఎంఎల్ కొబ్బరి నూనెలో 12 చుక్కల జునిపెర్ ఆయిల్ వేసి క‌లుపాలి. ఈ మిశ్ర‌మాన్ని దుర‌ద ఉన్న ప్ర‌దేశంలో అప్లై చేయాలి. దీనిని 60 నిమిషాలపాటు అలానే ఉంచాలి. రోజుకు రెండుసార్లు ఇలా చేస్తే ఫ‌లితం ఉంటుంది. జునిపెర్ ఆయిల్‌లో ఉండే శక్తివంతమైన శోథ నిరోధక లక్షణాలు దురద నుంచి ఉపశమనం పొందడమే కాకుండా, మంట, వాపును తగ్గిస్తాయి.

నిమ్మరసం 

కొంచెం నిమ్మర‌సాన్ని నాల్గవ కప్పు నీటితో కలపండి. ఇందులో కాట‌న్ ప్యాడ్‌ను నాన‌బెట్టి దుర‌ద ఉండే ప్ర‌దేశంలో రాయాలి. 30 నిమిషాల త‌ర్వాత క‌డిగేయాలి. ఇలా చేస్తే దుర‌ద నుంచి విముక్తి పొందుతారు. నిమ్మరసంలో సిట్రిక్, విటమిన్ సి ఉంటాయి. ఇది చర్మాన్నిదురద, మంటను తగ్గిస్తుంది.