శుక్రవారం 22 జనవరి 2021
Health - Jan 11, 2021 , 21:46:32

యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గించే హోం రెమెడీస్

యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గించే     హోం రెమెడీస్

మహిళలకు  సాధార‌ణంగా వ‌చ్చే ఆరోగ్య స‌మ‌స్య‌ల్లో  యూరిన్ ఇన్ఫెక్షన్ ఒకటి. ఇది ర‌క‌ర‌కాల‌ కారణాల వల్ల వస్తుంది.  ఈ సమస్య చాలా ఇబ్బంది పెట్టినప్పటికీ దీని గురించి  బయటకు చెప్పుకోవ‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు.  ఇలాంటి సమస్యలతో బాధ‌ప‌డే వారు  త‌ప్ప‌నిస‌రిగా వైద్యుడిని సంప్రదించాల్సిందే.    యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యను నివారించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.   

1. ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండటం

యూరిన్ ఇన్ఫెక్షన్ కు ప్రధాన కారకాల్లో ఒకటి నిర్జలీకరణ(డీహైడ్రేషన్) కాబట్టి, ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల ఈ సమస్య నుంచి బయట పడచ్చు. అంటే పుష్కలంగా ద్రవాలు, ముఖ్యంగా నీరు త్రాగాలి. మూత్ర మార్గము పనితీరును మెరుగుపరచడానికి నీరు సహాయపడుతుంది.   బ్యాక్టీరియా మూత్ర అవయవాల చుట్టూ ఉన్న కణాలకు చేరకుండా నిరోధిస్తుంది.

2. పరిశుభ్రత పాటించండి

మీ జననేంద్రియ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అంతేకాదు ఎక్కువసేపు  మూత్రాన్ని ఆపుకోవడం కూడా చేయకండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. లైంగిక సంబంధం తర్వాత మూత్రం పాస్ చేసి, జననేంద్రియాన్ని శుభ్రం చేసుకోవడం మర్చిపోకండి. 

3. వెల్లుల్లి

వెల్లుల్లి అనేది అందరి వంటగదిల్లో దొరికే పదార్ధం.  దీనిని యుటిఐకి చికిత్సకు తరచుగా వాడుతుంటారు. యూరినరీ ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే హానికరమైన బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది. కాబట్టి మీ రెగ్యులర్ ఆహారాలలో వెల్లుల్లిని కూడా చేర్చడం మంచిది.

4. తాపన ప్యాడ్లు(హీటింగ్ ప్యాడ్స్)

మీ వెన్నుముక, పొత్తి కడుపు ప్రాంతంలో తాపన ప్యాడ్లను ఉపయోగించడం వల్ల యుటిఐ కారణంగా కలిగే నొప్పిని తగ్గించుకోవచ్చు. ఇది మూత్ర మార్గంలోని బ్యాక్టీరియాను కూడా చంపుతుంది.

4. ప్రోబయోటిక్స్ తీసుకోండి

గట్ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియాను పెంచడానికి ప్రోబయోటిక్స్ సహాయపడతాయి, ఇవి యూరిన్ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపుతాయి.    పులియబెట్టిన ఆహారార ప‌దార్థాల్లో  ప్రోబయోటిక్స్ కనిపిస్తాయి. కాబట్టి, మీ పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఈ ఆహారాలను మీ రెగ్యులర్ డైట్‌లో చేర్చవచ్చు.logo