శుక్రవారం 23 అక్టోబర్ 2020
Health - Sep 25, 2020 , 18:59:45

గోళ్ల‌లో మ‌ట్టిచేరి నొప్పిగా ఉందా? అయితే ఇలా చేయండి!

గోళ్ల‌లో మ‌ట్టిచేరి నొప్పిగా ఉందా? అయితే ఇలా చేయండి!

పొలం ప‌నులు చేసేవారు ఎక్కువ‌గా బుర‌ద‌, మ‌ట్టిలో తిర‌గాల్సి వ‌స్తుంది. ఆ స‌మ‌యంలో మ‌ట్టి కాళ్ల గోళ్ల‌లోకి చేరి ఫ‌లితంగా నొప్పిని క‌లిగిస్తుంది. అయితే ఈ స‌మ‌స్య వీరికే కాదు సిటీల్లో ఉండేవారికి కూడా ఎదుర‌వుతుంది. గోర్ల‌ను స‌రిగా శుభ్రం చేసుకోక‌పోయినా ఈ స‌మ‌స్య‌కు గుర‌వ్వాల్సిందే. దీంతో భ‌రించ‌లేని నొప్పిని ఫేస్ చేయాల్సి వ‌స్తుంది. ఈ బాధ నుంచి విముక్తి పొందాలంటే ఇంటి చిట్కాలే స‌రిపోతాయి. ఇంట్లో ఇవి ఉంటే చాలు. కొన్నిరోజుల్లోనే స‌మ‌స్య‌ను అదిగ‌మించ‌వ‌చ్చు. మ‌రి అవేంటో తెలుసుకోండి. 

టీ ట్రీ ఆయిల్

3 చుక్క‌ల టీ ట్రీ ఆయిల్, కొబ్బ‌రి నూనె రెండింటినీ బాగా క‌లుపాలి. ఈ మిశ్ర‌మాన్ని కాట‌న్ ప్యాడ్ మీద వేసి నొప్పిగా ఉండే గోళ్ళ‌పై రాయాలి. రోజుకు రెండుసార్లు చొప్పున ప్ర‌తిరోజూ చేస్తే నొప్పి మాయ‌మైపోతుంది.

విక్స్ వాపోరబ్ 

ముందుగా పెరిగున్న గోళ్ల‌ను క‌ట్ చేయాలి. త‌ర్వాత గోళ్ల‌ను శుభ్రం చేయాలి. త‌ర్వాత నొప్పిగా ఉన్నగోళ్ల మీద విక్స్ వాపోర‌బ్‌ను రాయాలి. త‌ర్వాత శుభ్ర‌ప‌రిచిన గుడ్డ‌ను ఆ బొట‌న‌వేలు మీద క‌ప్పాలి. రాత్రంతా అలానే వ‌దిలేస్తే ఫ‌లితం ఉంటుంది. ఇలా కొన్ని ప‌డుకునే ముందు కొన్ని వారాల‌పాటు చేస్తే స‌రిపోతుంది.

ఒరేగానో ఆయిల్ 

ఒక టీస్పూన్ కొబ్బరి నూనెలో నాలుగు చుక్కల ఒరేగానో నూనె వేసి బాగా క‌లుపాలి. ఈ మిశ్ర‌మాన్ని ప్ర‌భావిత గోర‌కు రాయాలి. ఇది పూర్తిగా ఆరేవ‌ర‌కు వ‌దిలేయాలి. ఇలా ప్ర‌తిరోజూ రెండుసార్లు చేయాలి.  

ఆలివ్ లీఫ్ ఎక్స్‌ట్రాక్ట్

ఆలివ్ ఆకు సారం యాంటీ ఫంగల్ లక్షణాలను ప్రదర్శిస్తుందని పరిశోధనలు చెబుతున్నారు. ఇది గోళ్ళను మళ్లీ ఆరోగ్యంగా ఉంచుతాయి. నొప్పిగా ఉన్న బొట‌న‌వేలు గోళ్ల‌పైన ఆలివ్ ఆకు సారం అప్లై చేయాలి. దీనిని ఆర‌బెట్టాలి. ప్ర‌తిరోజూ రెండుసార్లు చొప్పున ప్ర‌తిరోజూ చేస్తే మంచిది.   

ఓజోనైజ్డ్ పొద్దుతిరుగుడు నూనె

ఓజోనైజ్డ్ పొద్దుతిరుగుడు నూనె శిలీంధ్ర లక్షణాలను ప్రదర్శిస్తుంది. ఓజోనైజ్డ్ పొద్దుతిరుగుడు నూనెను గోళ్ల‌కు రాయాలి. త‌ర్వాత శుభ్ర‌మైన గుడ్డ‌తో క‌ప్పిపెట్టాలి. ప్ర‌తిరోజూ ఇలా చేస్తే స‌రిపోతుంది. 

వెనిగర్

అర‌క‌ప్పు వెనిగ‌ర్‌, మూడు క‌ప్పుల నీరు తీసుకొని ఒక గిన్నెలో బాగా క‌లుపాలి. ఈ మిశ్ర‌మంలో పాదాల‌ను 20 నిమిషాల పాటు నాన‌బెట్టాలి. ఇలా త‌రుచూ చేస్తుంటే నొప్పి నుంచి విముక్తి పొందుతారు.  

వెల్లుల్లి

వెల్లుల్లిలో యాంటీమైకోటిక్ లక్షణాలను కలిగి ఉన్న అజోయిన్ అనే బయోయాక్టివ్ సమ్మేళనం ఉంటుంది. గోళ్ళ ఫంగస్‌కు కారణమయ్యే ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌తో పోరాడటానికి వెల్లుల్లి సహాయపడుతుంది. వెల్లుల్లిపైనుండే తొక్కును వ‌లిచి బాగా చూర్ణం చేయాలి. ఈ పేస్ట్‌ను నొప్పిగా ఉన్న గోళ్ల మీద పెట్టాలి. అర‌గంట త‌ర్వాత పాదం కడిగేసుకుంటే స‌రిపోతుంది. ఇలా ప్ర‌తిరోజూ రెండుసార్లు చేస్తే నొప్పి త‌గ్గుతుంది.  

హైడ్రోజన్ పెరాక్సైడ్

ఒక కప్పు హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణాన్ని తీసుకొని మూడు కప్పుల నీటితో కలుపాలి. ఈ మిశ్ర‌మాన్ని పెద్ద ట‌బ్‌లోకి మార్చాలి. ఈ నీటిలో పాదాల‌ను 20 నిమిషాల పాటు నాన‌బెట్టాలి. నొప్పి త‌గ్గేంత‌వ‌ర‌కు డైలీ ఇలా చేయాలి. చాలా తొంద‌ర‌గా స‌మ‌స్య త‌గ్గిపోతుంది. 

కలబంద

కలబందలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఈ రెండు లక్షణాలు గోరు ఫంగస్‌కు కారణమయ్యే చర్మశోథలతో పోరాడటానికి సహాయపడతాయి. క‌ల‌బంద జెల్‌ను బాధిత గోళ్ళ‌కు అప్లై చేయాలి. 20 నిమిషాల త‌ర్వాత క‌డిగేస్తే స‌రిపోతుంది. రోజూ రెండుసార్లు ఇలా చేస్తే గోరునొప్పి త‌గ్గిపోతుంది.


logo