గురువారం 04 మార్చి 2021
Health - Jan 26, 2021 , 19:49:31

మీ కిచెన్‌లో పెయిన్ కిల్లర్లు ఉన్నాయ్.. గమనించారా!

 మీ కిచెన్‌లో పెయిన్ కిల్లర్లు ఉన్నాయ్.. గమనించారా!

శరీరానికి సంబంధించి ఏదైనా నొప్పి  ఉంటే  క్షణాల్లో తగ్గించేసుకోవాల‌నుకుంటాం. అందుకు   తక్షణ ఉపశమనం  కోసం రకరకాల ట్యాబెట్లు, ఆయింట్ మెంట్లను వాడుతుంటాం.  ఔష‌ధాలు వాడినంత‌సేపు బాగానే ఉంటుంది. కానీ, త‌ర్వాత  సైడ్ ఎఫెక్ట్స్ మొద‌ల‌వుతాయి. కొంద‌రిలో  లివర్, పేగులు, కిడ్నీలు పాడైపోతాయి.  ట్యాబ్లెట్ల‌కు   బదులుగా ఇంట్లోనే  సహజ పద్ధతుల్లో నొప్పికి ఉపశమనం ఇచ్చే రెమెడీలు  ఉన్నాయి. అవేంటో చూద్దాం!  

1. పుదీనా:

తలనొప్పి, కండరాల నొప్పి, పంటినొప్పి, నరాల నొప్పి రిలీఫ్ కోసం పుదీనా తినండి. కొన్ని ఆకులను తీసుకుని నమిలితే జీర్ణక్రియలో సమర్థవంతంగా పనిచేస్తాయి. వేడి నీళ్లలో పుదీనా రసం కలిపిన నూనె వేస్తే కండరాల నొప్పికి రిలాక్సేషన్ దొరుకుతుంది. 

2. పెరుగు (యోగట్):

రోజుకు ఒక బౌల్ యోగట్ ను రెండు సార్లు తీసుకోండి. దీని వల్ల జీర్ణక్రియ మెరుగై నెలసరి సమస్యల నుంచి బయటపడి కడుపులో నొప్పిని మాయం చేస్తుంది. 

3. అల్లం

కడుపులో నొప్పి, ఛాతీ నొప్పి, కండరాల నొప్పులు, నెలసరి సమస్యలు ఆర్థరైటిస్, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కొన్ని స్టడీస్ లో అల్లం టీ తాగితే మైగ్రేన్ తలనొప్పి కూడా పోయినట్లు తేలింది. 

4. వెల్లుల్లి: 

ఇది యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలున్న పదార్థం. ఆర్థరైటిస్‌ నొప్పి, చెవినొప్పి, నోటి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ ఇస్తుంది. వేడి అల్లం నూనెను జాయింట్లై వేసి మర్ధన చేసుకుంటే నొప్పులు పోతాయి. 

5. పసుపు:

కండరాలు, జాయింట్ల నొప్పుల నుంచి రిలీఫ్ వస్తుంది. వాపులకు కూడా మంచి మందు. అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ కూడా. దురదలు, అలర్జీ లాంటివి వచ్చినప్పుడు కలబందతో కలిపి సమంగా రుద్దుకుంటే మంచిది.

VIDEOS

logo