శనివారం 30 మే 2020
Health - Mar 28, 2020 , 17:11:48

మీది పొడి జుట్టా.. అయితే ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే బట్టతల ఖాయం

మీది పొడి జుట్టా.. అయితే ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే బట్టతల ఖాయం

మీరు తరచూ తలస్నానం చేస్తున్నారా? ఎక్కువగా ఎండలో తిరుగుతుంటారా? జట్టు అందంగా కనిపించాలని హెయిర్‌ స్టయింలింగ్‌ ఉత్పత్తులను ఎక్కువగా వాడుతున్నారా అయితే మీకు బట్టతల రావడం కాయం. అవును ఇలా తరచూ చేస్తుండటం వల్ల జుట్ట పొడివారుతుంది. దీంతో జుట్టు పేలవంగా, పేళుసుబారుతుంది. జుట్టులో తగినంత తేమ లేకపోవడంతో జుట్టురాలడం మొదలై శాశ్వతంగా ఊడిపోవడానికి కారణమవుతుంది. దీంతో బట్టతల వస్తుంది. ఇది పెద్ద ఆరోగ్య సమస్య కాకపోయినా చిన్న తనంలోనే జుట్టురాలిపోవడంతో మనలో ఆత్మవిశ్వాసం దెబ్బతింటింది. సో.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని నివారించవచ్చు. ఇలా దెబ్బతిన్న, పొడివారిన జట్టుకు చికిత్స చేయడానికి డాక్టర్లవద్దకు వెళ్లకుండానే, రసాయనాలు ఉపయోగించకుండానే ఇంటివద్దే తయారుచేసుకుని పద్ధతులు చూద్దాం..

కోడి గుడ్డుతో మాస్క్‌  

అరకప్పు కొవ్వు పెరుగు, ఒక గుడ్డు, మూడు టేబుల్‌ స్పూన్ల తేనెను కలిపి ఒక మిశ్రమంగా తయారు చేసుకోవాలి. దాన్ని పొడివారిన జట్టుకు బాగా పూసి 30 నిమిషాలపాటు కవర్‌చేసి ఉంచాలి. తర్వాత జుట్టును షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమంతప్పకుండా చేస్తే జుట్టులో తేమశాతం పెరుగుతుంది. 

షాంపూతోపాటు గుడ్డు

సాధారణంగా మనం షాంపూను నేరుగా జుట్టుకు అప్లయ్‌ చేస్తాం. అలాకాకుండా ఒక గిన్నెలో షాంపూని వేసి దాన్ని గుడ్డుతో కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లయ్‌ చేసి ఐదు నిమిషాల తర్వాత బాగా కడగాలి. ఇది జుట్టులోని ప్రొటీన్‌ కంటెంట్‌ను అధికంచేస్తుంది. 

అరటిపండుతో..

అరటిపండులో తేమ, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. అందువల్ల పండిన అరటిపండును గుజ్జుగా చేసి జుట్టు మీద, మూలాల నుంచి చివర వరకు బాగా పూయాలి. ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో జట్టును కడగాలి. ఇలా చేయడంవల్ల జుట్టు చీలిక చివరలు మెత్తబడటం, స్థితి స్థాపకత వంటివి మెరుగుపడుతాయి. 

పెరుగు, ఆయిల్‌ మాస్క్‌

ఇది జుట్టు చాలా ప్రభావవంతమైన చికిత్స. రెండు టీస్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌, అరకప్పు పెరుగు, ఆరు టేబుల్‌ స్పూన్ల ఎసెన్షియల్‌ ఆయిల్‌ను బాగా కలిపి ఒక ప్యాక్‌లా చేసుకోవాలి. దాన్ని షాంపూ చేసిన జుట్టుకు పూయాలి. తర్వాత జట్టును ప్లాస్టిక్‌ కవర్‌తో 20 నిమిషాలపాటు కప్పిఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో జుట్టును బాగా కడగాలి. 

వెన్న

జుట్టుపై కొంచెం వెన్న వేసి బాగా మసాజ్‌ చేయాలి. తర్వాత షవర్‌ క్యాప్‌తో అరగంట కవర్‌ చేయాలి. అనంతరం షాంపూతో కడగాలి.

హెయిర్‌ ఆయిల్స్‌

పొడి జుట్టు ఉన్నవారు విటమిన్‌ ఈ, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆలివ్‌ ఆయిల్‌, కొబ్బరి, బాదం, మొక్కజొన్న నూనెలను ఉపయోగించాలి. ఇవి జుట్టు బయటి పొరల్లో తేమను పునరుద్ధరిస్తాయి. అయితే ఇలాంటివారికి ఆలివ్‌ ఆయిల్‌ చాలా ఉపయోగకరం. అదేవిధంగా అర కప్పు నూనెను కొద్దిగా వేడియాలి. దాన్ని జుట్టుకు సున్నితంగా మాసాజ్‌ చేసి టవల్‌తో కప్పి ఉంచాలి. గంట తర్వాత షాంపూతో స్నానం చేయాలి. ఇది జట్టును జుట్టును బలంగా చేయడంతోపాటు మెరిసేలా చేస్తుంది. 


logo