శనివారం 19 సెప్టెంబర్ 2020
Health - Sep 12, 2020 , 16:41:11

కీళ్ల‌నొప్పుల‌ను న‌యంచేసే మందును ఇంట్లోనే త‌యారు చేసుకోండి!

కీళ్ల‌నొప్పుల‌ను న‌యంచేసే మందును ఇంట్లోనే త‌యారు చేసుకోండి!

త‌ల‌నొప్పి, జ‌లుబు, ద‌గ్గు, న‌డుమునొప్పి ఇలా నొప్పి ఏదైనా దానికి వాడే ఏకైక‌ మందు పెయిన్ బామ్‌. ఇదివ‌ర‌కు ఇది క్రీమ్ టైప్‌లో వ‌చ్చేది. ఇప్పుడు స్ప్రే రూపంలో దొరుకుతుంది. అయితే ఏ చిన్న నొప్పి వ‌చ్చినా ప‌నిచేసుకోవ‌డానికి ఇబ్బంది క‌లుగుతుంటుంది. చేసే ప‌ని కూడా లేట్ అవుతుంది. దీంతో చిన్న చిత‌క జ‌బ్బుల‌కు కూడా ఇంగ్లీష్ మందులు వాడితే త‌ర్వాత సైడ్ ఎఫెక్ట్స్‌కు గుర‌వుతారు. అందుక‌ని పెయిన్ బామ్‌ను ఇంట్లోనే త‌యారు చేసుకుంటే మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇప్పుడు త‌యారీ విదానం చూద్దాం.

* బ‌య‌ట దొరికే పెయిన్ కిల్ల‌ర్ మందులు వెంట‌నే ఉప‌శ‌మ‌నాన్నిచ్చినా త‌ర్వాత ప్ర‌భావం చూపుతుంది. దీంతో స్ట‌మ‌క్ అప్సెట్‌, గుండెల్లో మంట‌, నీర‌సం, వికారం వంటి ప‌రినామాల‌కు దారి తీస్తుంది. 

* నొప్పి త‌గ్గ‌లేదు క‌దా అని ఎక్కువ డోసేజ్‌లో తీసుకుంటే గుండెపోటు, లివ‌ర్ డ్యామేజ్ వంటి వాటికి దారి తీస్తుంది.  

పెయిన్ బామ్‌కు కావాల్సిన పదార్ధాలు : 

కర్పూరం : ఒక టేబుల్ స్పూన్

ఎక్ట్స్రా వ‌ర్జిన్ కొకోనట్ ఆయిల్ : పావు కప్పు

తురిమిన బీస్వాక్స్ : 2 టేబుల్ స్పూన్స్‌

లవంగ నూనె : 5 డ్రాప్స్‌

పెప్పర్‌మింట్ ఎసెన్షియల్ ఆయిల్ : 9 డ్రాప్స్‌

ఆర్నికా ఎసెన్షియల్ ఆయిల్ : 7 డ్రాప్స్‌

త‌యారీ :

ముందుగా ఒక బౌల్‌లోకి ఎక్ట్స్రా వ‌ర్జిన్ కొకోనట్ ఆయిల్‌ను తీసుకోవాలి. ఇందులో తురిమిన బీస్వాక్స్ వేసి బాగా క‌లుపాలి. త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని మైక్రొవేవ్‌లో ఈ రెండూ క‌రిగే వ‌ర‌కు అంటే ఒక నిమిషం పాటు క‌రిగించాలి. త‌ర్వాత ఇందులో క‌ర్పూరం వేసి క‌రిగించాలి. 20 సెకండ్లు వేడి చేయాలి. ఆ త‌ర్వాత ఎసెన్షియల్ ఆయిల్స్ వేసి కలుపాలి. బాగా క‌లిపిన త‌ర్వాత స్టెరిలైజ్ చేసిన కంటైజ‌ర్‌లోకి ట్రాన్స్‌ప‌ర్ చేయాలి. ఈ మిశ్ర‌మాన్ని చ‌ల్లార్చాలి. అంతే.. దీనిని ఒక సీసాలో వేసి గ‌ట్టిగా మూత పెట్టాలి. ఎండ త‌గ‌ల‌ని ప్ర‌దేశంలో పెడితే పెయిన్ బామ్‌ను ఎప్ప‌డు కావాలంటే అప్పుడు వాడుకోవ‌చ్చు. 

 


logo