బుధవారం 23 సెప్టెంబర్ 2020
Health - Aug 25, 2020 , 17:49:16

తులసి ప్రయోజనాలు తెలుసా?

తులసి ప్రయోజనాలు తెలుసా?

ఇటాలియన్‌, థాయ్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల తులసీలు ఉన్నాయి. కానీ పవిత్రమైనదిగా భావించే ఒకే రకం ఉంది. భారతదేశంలో తులసి వేల సంవత్సరాల పవిత్రంగా భావిస్తూ పూజలు చేస్తూ వస్తున్నారు. ముదురు రంగులో ఉండే దాన్ని కృష్ణ తులసి అనీ, కొంచెం లేతరంగులో ఉండేదాన్ని రామ తులసీ అంటారు. సాధారణంగా కృష్ణతులసిని పూజకు వాడుతారు. ఆయుర్వేద ఔషధాలలో కూడా కృష్ణ తులసిని అధికంగా వాడుతున్నారు. 2014లో ప్రచురి౦చబడిన జర్నల్ ఆఫ్ ఆయుర్వేద అ౦డ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్‌లో ప్రచురి౦చబడిన ఒక అధ్యయన౦ ప్రకార౦.. భౌతిక, రసాయనిక, జీవక్రియ, మానసిక ఒత్తిడిని పరిష్కరి౦చగల ఔషధ చర్యల ప్రత్యేక స౦బ౦ధమైన తులసి ఉ౦దని ప్రప౦చవ్యాప్త౦గా ఉన్న శాస్త్రీయ రుజువులు సూచిస్తున్నాయి. పోషకపరంగా తులసిలో విటమిన్ ఏ, సీ, క్యాల్షియం, ఐరన్‌, జింక్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉన్నాయి. తులసిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక విధాలుగా ప్రయోజనం పొందవచ్చు. ముఖ్యంగా కొన్ని సీజన్లలో ఇన్ఫెక్షన్స్ వంటి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు నివారిస్తుంది. తులసి రోగ నిరోధక శక్తిని, సంపూర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 

ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షణగా..

తులసిలో శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, మరియు అనాల్జిసిక్ (పెయిన్ కిల్లర్) లక్షణాలు ఉన్నాయి. తద్వారా వీటిని తినడం వల్ల ఇన్ఫెక్షన్లను నిరోధించవచ్చు. గాయాలు త్వరగా మానుతాయి.  

బ్లడ్ షుగర్‌ను మ్యానేజ్ చేస్తుంది..

తులసి వేళ్లు, కాండం, ఆకులు తులసిలోని ప్రతి భాగం మీ రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. హైపర్ ఇన్సులినేమియాను కూడా నిరోధిస్తుంది. ఒకవేళ మీకు టైప్-1, టైప్-2 డయాబెటిస్ ఉన్నట్లయితే తులసిని తప్పనిసరిగా తీసుకోవాలి.

కొలెస్ట్రాల్‌ తగ్గించడానికి సహాయపడుతుంది

తులసి జీవక్రియ బాధలను తొలగిస్తున్నారు. ఇది ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అదే సమయంలో హెచ్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ స్థాయిలను పెంచుతుంది. ఈ జీవక్రియా చర్య, తులసిలో ఉండే నూనె యూజెనాల్‌కు కారణం కావచ్చు. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతోపాటుగా శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

నొప్పి నివారిస్తుంది

తులసిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, అనాల్జిసిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది అన్ని రకాల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా, ఆర్థరైటిస్, ఫైబ్రోమయల్జియాతో సంబంధం ఉన్న నొప్పి నివారిస్తుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

తులసి జీర్ణవ్యవస్థకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఎసిడిటీని దూరం చేయడమే కాదు.. అల్సర్లు, అజీర్ణం, ఇతర జీర్ణ రుగ్మతలను కూడా నివారిస్తుంది. తేనె, అల్లంతో చేసిన తులసి టీ కూడా హార్ట్ బర్న్ లక్షణాలను తగ్గింపచేస్తుంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo