యాపిల్ సైడర్ వెనిగర్‌తో బరువు తగ్గవచ్చు.. ఎలాగంటే..?


Tue,January 2, 2018 02:40 PM

నేటి తరుణంలో అధిక బరువు సమస్య చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నది. ఒంట్లో అధికంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించేందుకు అందరూ నానా అవస్థలు పడుతున్నారు. అందులో భాగంగానే యోగా, జిమ్ వంటి వ్యాయామాలు చేస్తున్నారు. అయితే దీనికి తోడు యాపిల్ సైడర్ వెనిగర్‌ను కింద చెప్పినట్టుగా తీసుకుంటే దాంతో శరీరంలో ఉన్న కొవ్వును త్వరగా కరిగించుకోవచ్చు. దీంతో అధిక బరువు తగ్గుతారు. మరి బరువు తగ్గాలంటే యాపిల్ సైడర్ వెనిగర్‌ను ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

ఒక గ్లాస్ నీటిలో రెండు టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ వేయాలి. అనంతరం బాగా కలిపి ఆ మిశ్రమాన్ని భోజనానికి 30 నిమిషాల ముందు సేవించాలి. ఇలా రోజుకు 3 సార్లు చేయాల్సి ఉంటుంది. ఈ మిశ్రమాన్ని ఒక వారం పాటు తాగి చూస్తే మీ శరీరంలో వచ్చే తేడాను మీరే గమనిస్తారు.

యాపిల్ సైడర్ వెనిగర్‌ను పైన చెప్పిన విధంగా తాగడం వల్ల జీర్ణప్రక్రియ మెరుగు పడుతుంది. శరరీంలో ఉండే కొవ్వు కరుగుతుంది. వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. దీంతోపాటు ఆకలి తక్కువ వేసేలా చేస్తుంది. ఫలితంగా తక్కువ ఆహారం తీసుకుంటారు. అధిక బరువు తగ్గుతారు.

5009
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles