చేతివేళ్లను చూసి గుండె జబ్బులు వస్తాయో, రావో చెప్పేయవచ్చట..!


Mon,December 17, 2018 05:33 PM

అవును, మీరు విన్నది నిజమే. ఎవరికైనా చేతి వేళ్లను చూసి వారికి గుండె జబ్బులు వస్తాయో, రావో ఇట్టే చెప్పేయవచ్చు. ఈ విషయాన్ని మేం చెప్పడం లేదు. సైంటిస్టులే చెబుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ లివర్‌పూల్‌కు చెందిన బయోలాజికల్ సైంటిస్టులు ఇటీవలే హార్ట్ ఎటాక్ వచ్చిన 151 మందిని పరీక్షించారు. వారిలో ఉంగరం వేలి కన్నా చూపుడు వేలు పొడవు ఎక్కువగా ఉన్న వారిలో హార్ట్ ఎటాక్‌లు త్వరగా, తక్కువ వయస్సులో వచ్చాయట. 35 నుంచి 80 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్నవారి ఉంగరం వేళ్ల కన్నా చూపుడు వేళ్లు పొడవుగా ఉంటే అలాంటి వారికి హార్ట్ ఎటాక్‌లు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుందట. ఇక చూపుడు వేలి కన్నా ఉంగరం వేలు పొడవు ఎక్కువగా ఉండేవారికి 58 నుంచి 80 సంవత్సరాల వయస్సులో హార్ట్ ఎటాక్‌లు వచ్చేందుకు అవకాశం ఉంటుందట. అదే సమయంలో చూపులు వేలు, ఉంగరం వేలు సమానంగా ఉన్నవారికి హార్ట్ ఎటాక్‌లు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని కూడా ఆ సైంటిస్టులు చెబుతున్నారు.

అయితే చేతి వేళ్ల పొడవు ఎలా ఉన్నప్పటికీ గుండె జబ్బులు వచ్చేందుకు పలు ఇతర కారణాలు కూడా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఆర్థరైటిస్ ఉన్నవారు, పొగ తాగేవారు, మద్యం సేవించేవారు, డయాబెటిస్, హైబీపీ, కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు, అధిక బరువు, స్థూలకాయం ఉన్నవారు, ఒత్తిడి అధికంగా ఫీలయ్యేవారు, జంక్ ఫుడ్ ఎక్కువగా తినేవారికి హార్ట్ ఎటాక్స్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. కనుక ఎవరైనా ఆరోగ్యకరమైన జీవన విధానం కలిగి ఉంటే గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవచ్చని వారు చెబుతున్నారు.

8358

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles