జీవన విధానంలో స్వల్ప మార్పులతో హార్ట్ పేషెంట్లకు మెరుగైన జీవితం..!


Tue,October 23, 2018 12:45 PM

ప్రస్తుత తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న అత్యధిక మరణాల్లో గుండె జబ్బుల కారణంగా మరణిస్తున్న స్త్రీలు, పురుషుల సంఖ్యే ఎక్కువగా ఉంటున్నది. ఇందుకు కారణం.. చాలా మంది గంటల తరబడి కూర్చుని పనిచేసే ఉద్యోగాలు చేస్తున్నందున వారికి శారీరక శ్రమ లేక అధిక బరువు పెరగడం, తద్వారా గుండె జబ్బుల బారిన పడడం జరుగుతున్నది. సైంటిస్టులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. అయితే ఇలా కూర్చుని పనిచేసేవారు మధ్య మధ్యలో కొంత సేపు పనికి విరామం ఇచ్చి తేలికపాటి వ్యాయామాలు చేస్తే గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. అలాగే ఇప్పటికే గుండె జబ్బులు ఉన్నవారు తమ జీవన విధానంలో పలు స్వల్ప మార్పులు చేసుకోవడం ద్వారా మెరుగైన జీవితాన్ని జీవించవచ్చని వైద్యులు చెబుతున్నారు.

1. గుండె జబ్బులు ఉన్నవారు తాము నిత్యం తీసుకునే ఆహారం పట్ల కచ్చితమైన నియమాలు పాటించాలి. తాజా కూరగాయలు, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాలను నిత్యం ఎక్కువగా తినాలి. అలాగే సీజనల్ పండ్లను కూడా తినాలి. దీని వల్ల గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.

2. నిత్యం కనీసం 30 నిమిషాల పాటు అయినా తేలికపాటి వ్యాయామాలు చేయాలి. వాకింగ్, సైకిల్ తొక్కడం, ఎరోబిక్స్, జాగింగ్ చేయడం, యోగా వంటి వ్యాయామాలు చేస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

3. నిత్యం పలు సందర్భాల్లో ఎవరికైనా ఒత్తిడి ఎదురవుతుంటుంది. అయితే ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవడం ద్వారా కూడా గుండె జబ్బులు ఉన్నవారు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అందుకు గాను హాబీలను అలవాటు చేసుకోవాలి. బుక్స్ చదవడం, సంగీతం వినడం, ఆటలు ఆడడం వంటి హాబీలు ఉంటే ఒత్తిడి మటుమాయం అవుతుంది.

4. అధిక బరువు ఉన్న వారు దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. దీని వల్ల గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. గుండె జబ్బులు ఉన్నవారు కూడా తమ బరువును నియంత్రణలో ఉంచుకోవడం మంచిది.

5. దంత సమస్యలతో సతమతమయ్యేవారికి గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. కనుక దంతాల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. చిగుళ్లు, నాలుక సమస్యలు కూడా ఉండకుండా చూసుకోవాలి.

6. రోజుకు తగినన్ని గంటల పాటు నిద్రించాలి. నిత్యం కనీసం 6 నుంచి 8 గంటల పాటు నిద్రిస్తే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. గుండె జబ్బులు ఉన్నవారు రోజూ త్వరగా నిద్రించి త్వరగా నిద్రలేస్తే మంచిది.

1429
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles