e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home News ఎక్కువ స‌మ‌యం ప్రేమించిన వ్య‌క్తితోనే గ‌డుపుతున్నారా? ఈ విష‌యం తెలిస్తే షాక‌వుతారు..

ఎక్కువ స‌మ‌యం ప్రేమించిన వ్య‌క్తితోనే గ‌డుపుతున్నారా? ఈ విష‌యం తెలిస్తే షాక‌వుతారు..

మ‌న‌సుల క‌ల‌యిక‌తో ఇద్ద‌రి మ‌ధ్య చిగురించే ప్రేమ‌.. ఎంతో ధృడంగా మారుతోంది. ఈ ప్రేమ వారికి శారీర‌క ఆరోగ్యంతో పాటు గుండెకు కూడా మంచి ఆరోగ్యాన్ని ప్ర‌సాదిస్తుంది అని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

కార్డియాల‌జీ వైద్య నిపుణుల ప్ర‌కారం.. ఇద్ద‌రు ప్రేమికులు తొలిసారిగా క‌లిసిన‌ప్పుడు.. వారి నుంచి నోరిపినెఫ్రిన్, అడ్రిన‌లిన్ వంటి హార్మోన్లు విడుద‌ల‌వుతాయి. ఈ హార్మోన్లు వారి మ‌న‌సుల‌ను ఉత్తేజ‌ప‌రుస్తాయి. అంతేకాకుండా ప్రేమించిన వ్య‌క్తి మ‌న కళ్ల ముందు ఉండ‌టంతో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణను క‌లిగి ఉంటాము. వారి హృద‌య‌స్పంద‌న కూడా పెరుగుతుంది. మ‌న‌సులు ఉత్తేజిత‌మ‌వ‌డం, ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌డం, హృద‌య‌స్పంద‌న పెర‌గ‌డం అన్ని ఏక‌కాలంలోనే జ‌రిగిపోతాయి.

- Advertisement -

ఇక మీరు ప్రేమించిన వ్య‌క్తితో అధిక స‌మ‌యం గ‌డిపితే.. మీలో రొమాన్స్ పెరిగిపోతాయి. మీకు తెలియ‌కుండానే అవ‌తలి వ్య‌క్తికి ద‌గ్గ‌ర‌వుతుంటారు. ఆ స‌మ‌యంలో మ‌న మెద‌డు నుంచి ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్, వాసోప్రెసిన్ వంటి హార్మోన్లు విడుద‌లై ఆ ఇద్ద‌రి మ‌ధ్య ఆరోగ్య‌క‌ర‌మైన సంబంధాన్ని పెంపొందించ‌డంలో స‌హాయ ప‌డుతాయి.

ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్, వాసోప్రెసిన్ వంటి హార్మోన్లు.. రక్తపోటును తగ్గించడం, హృదయ స్పందన రేటును త‌గ్గిస్తాయి. దీంతో గుండెను ఆరోగ్యంగా కాపాడుకోవ‌డానికి స‌హాయప‌డుతుంది. సైన్స్ ప్ర‌కారం.. ఓ వ్య‌క్తి తమ భాగస్వామితో అన్యోన్యంగా స‌మ‌యం గడిపినప్పుడు, వారి రక్తపోటు, హృదయ స్పందన తగ్గుతుంది. ఒకరికొకరు సురక్షితంగా, సుఖంగా ఉంటారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement