శుక్రవారం 04 డిసెంబర్ 2020
Health - Oct 28, 2020 , 19:51:57

ఆరోగ్యాన్ని అందించే పదార్థాలు...వీటి గురించి తెలిస్తే అసలు వదలరు...!

 ఆరోగ్యాన్ని అందించే పదార్థాలు...వీటి గురించి తెలిస్తే అసలు వదలరు...!

 హైదరాబాద్ : కొబ్బరి నూనె, అల్లం, కలబంద, మిరియాలు,కొత్తిమీర ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ సహజ పదార్ధాల ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈ రోజుల్లో చాలా మందికి తెలియదు. ఇవి ఎన్నో శతాబ్దాలుగా పలురకాల వైద్యంలో వినియోగిస్తున్నారు. వాస్తవానికి వీటిని మన రోజువారీ జీవితంలో ఖచ్చితంగా ఇదొక రూపంలో ఉపయోగిస్తూనే ఉంటాం. వాటి ప్రయోజనాలు తెలుసుకుందాం...     

 కొబ్బరి నూనే:

పగిలిన పెదాలకు చికిత్స చేయడంతో పాటు, సహజమైన కొవ్వులు ఎక్కువగా ఉన్న కొబ్బరి నూనె, శరీరంలో ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ (హై-డెన్సిటీ లిపోప్రొటీన్ లేదా హెచ్‌డిఎల్ అని పిలుస్తారు) పెంచడంలో దోహదపడుతుంది. హెచ్‌డిఎల్‌ను పెంచడం ద్వారా కొబ్బరి నూనెలోని  శాచురేటెడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది . అంతేకాదు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.   జీవక్రియను పెంపొందిస్తుంది కూడా.

కలబంద

అలోవెరా గాయాలను నయంచేయడంలోనూ ఉపకరిస్తుంది. చర్మ సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. డయాబెటిక్ పేషేంట్లకు ఇది చక్కని ఔషధం . ఇది రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరచడంలో దోహదపడుతుంది. 

 ధనియాలు 

 ధనియాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది .  యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి ,సెల్యులార్ నష్టాన్ని నివారించడానికి సహాయపడుతుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటిక్యాన్సర్ , న్యూరోప్రొటెక్టివ్ లక్షణాలను కలిగి ఉంది. పార్కిన్సన్ ,అల్జీమర్స్ వంటి వ్యాధులు ఉన్నవారికి మంచి ప్రయోజనకారి ఇది.  జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో కూడా ఇవి ఉపయోగపడుతాయి. 

జీలకర్ర

ఇందులో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అంతేకాదు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీలకర్ర క్యాన్సర్ కణాలను నియంత్రించడంలో సహాయపడుతుంది, తద్వారా వ్యాధిని నివారించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడానికి కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది.

అల్లం

  అల్లం జీర్ణక్రియకు సహాయపడుతుంది, వికారం తగ్గించడానికి, ఫ్లూ , జలుబుతో పోరాడటానికి సహాయపడుతుంది. రోగనిరోధక శక్తి ని పెంపొందిస్తుంది.  

నల్ల మిరియాలు

వీటిని సుగంధ ద్రవ్యాల రాజు అని కూడా పిలుస్తారు. నల్ల మిరియాలు చాలా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి,  బరువు తగ్గడానికి సహాయపడుతాయి.ఇది జీర్ణక్రియకు కూడా చాలా మంచిది. వీటిలో విటమిన్ బి అధికంగా ఉంటుంది. వీటిలో ఉండే పొటాషియం అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాదు  ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది. ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.