బుధవారం 01 ఏప్రిల్ 2020
Health - Jan 27, 2020 ,

ఆరోగ్య చిట్కాలు

ఆరోగ్య చిట్కాలు

  • అల్లంలోని ఔషధ గుణం పొట్టలోని గ్యాస్‌ను బయటకు పంపిస్తుంది. దాంతో కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటివి తగ్గిపోతాయి.
  • ఒక టేబుల్‌ స్పూన్‌ అల్లం ముక్కల్ని రెండు కప్పుల నీటిలో వేసి 10 నిమిషాల పాటు మరిగించి ఆ నీటిని వడకట్టి చల్లారబెట్టాలి. ఈ అల్లం నీటిలో తేనె కలుపుకొని రోజులో రెండుసార్లు తాగితే జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.
  • తులసి ఆకుల్లో విటమిన్‌ A సమృద్ధిగా ఉంటుంది. రోజుకు రెండు ఆకులు తిన్నా కంటికి సంరక్షణ లభిస్తుంది.
  • తీసుకున్న ఆహారం వల్లగానీ శరీరంలోని వేడి ఎక్కువగా ఉన్నప్పుడు గానీ నోటి దుర్వాసన వస్తుంది. దాన్ని వెంటనే అరికట్టాలంటే రెండు, మూడు లవంగాలు నోట్లో వేసుకొని మెల్లగా నమిలితే సరిపోతుంది.
  • దాల్చిన చెక్కలో యాంటీ మైక్రోబయల్‌ లక్షణాలు ఉండడం వల్ల చర్మాన్ని రక్షిస్తుంది. యాంటీసెప్టిక్‌ గుణాలు ఉండడం వల్ల గాయాలకు మందుగానూ పనిచేస్తుంది.
  • పెరుగులో క్యాల్షియం అధికంగా ఉంటుంది. దీనివల్ల ఎముకలు గట్టి పడుతాయి. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు రోజూ కప్పు పెరుగు తింటే మంచి ఫలితం ఉంటుంది.
  • మధుమేహ వ్యాధితో బాధపడేవారు రోజూ కరివేపాకులను తినడం వల్ల వ్యాధి నియంత్రణలో ఉంటుంది.


logo
>>>>>>