గురువారం 03 డిసెంబర్ 2020
Health - Nov 19, 2020 , 18:41:07

ఈ లక్షణాలుంటే కొంచెం జాగ్రత్త పడండి..!

ఈ లక్షణాలుంటే కొంచెం జాగ్రత్త పడండి..!

 ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలోని కార్బ్స్  షుగర్‌ను శరీరం గ్లుకోజ్ గా మార్చుకుంటుంది. అప్పుడు ఇన్సులిన్ విడుదలై.. శరీరానికి బలాన్నిచ్చే గ్లూకోజ్‌ను రిలీజ్ చేసి శక్తిగా మారే ప్రక్రియ కోసం ఉపయోగపడుతుంది. హెల్తీ డైట్ తీసుకున్నట్లయితే శరీరానికి సరిపడా ఇన్సులిన్‌ను క్లోమం ఉత్పత్తి చేస్తుంది. 

ఎక్కువగా షుగర్ తీసుకున్నప్పుడు కూడా క్లోమం ఎక్కువ మొత్తంలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. శరీరంలో ఇలా జరుగుతున్నప్పుడు కలిగే ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను ఈ   లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు.

-నీరసం

- బ్రెయిన్ ఫాగ్

-ఆకలి ఎక్కువగా ఉండటం

-అధిక రక్తపోటు

-నడుం చుట్టూ కొవ్వు పేరుకుపోవడం

చాలా మందికి ఈ లక్షణాలు బయటపడకుండా నేరుగా డయాబెటిస్ సమస్య వచ్చే ప్రమాదం ఉంది. 

*డయాబెటిస్

ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య డయాబెటిస్. స్వీట్ ఉండే ఫుడ్ కారణంగా బరువు పెరిగిపోవడం, డయాబెటిస్ రావడం వంటివి జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్నట్లు స్టడీలు చెబుతున్నాయి. సోడా, ఎనర్జీ డ్రింక్‌లు, టీలు ఎక్కువగా తాగి బరువు పెరుగుతున్నారు. ఇలా టైప్ 2 డయాబెటిస్ కు దారి తీస్తుంది. 

*మందు తాగకుండానే లివర్ పాడవుతుంది

శరీరం ఎప్పుడైతే ఫ్రక్టోజ్‌ను మెటబలైజ్ చేస్తుందో అప్పుడే గ్లైకోజన్‌గా మారి కండరాలు, కాలేయంలో శక్తిని నిల్వ ఉంచుకునేందుకు సహాయ పడుతుంది. కానీ.. ఫ్రక్టోజ్‌ను అవసరానికి మించి తీసుకున్నట్లయితే అది కొవ్వుగా మారి కాలేయంపై ప్రభావం చూపిస్తుంది. దీన్ని లివర్ నిల్వ చేసుకోలేనంతగా మారుతుంది. ఇది ముందు ముందు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్‌గా మారుతుంది. 

*పంటి సమస్యలకు తీపి బంధువు

మనం తినే ఆహారంలో పళ్ల మధ్య, చిగుళ్ల మధ్య ఇరుక్కుని ఉండిపోయేవాటిలో ముఖ్యమైనది తీపి పదార్థమే. ఇది అలా మీ నోట్లో ఉండిపోయి.. టీత్ ఎనామిల్ ను డ్యామేజ్ చేసే యాసిడ్‌ను రిలీజ్ చేస్తుంది. ఇది పెరిగే కొద్దీ క్యావిటీస్‌తో పాటు పలు రకాల పంటి సమస్యలను తెచ్చిపెడుతుంది.

*ఊబకాయం

ప్రస్తుతం చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. అయితే ఊబకాయం రావడానికి ముఖ్య కారణం తీపి ఎక్కువగా తినడమే అంటున్నారు వైద్యలు. మన శరీరానికి కావలపినంత షుగర్ అందకపోతే బక్కచిక్కిపోతామట, అలాగే ఎక్కువగా తీసుకోవడం వల్ల అధికంగా బరువు పెరుగుతామట. ఎప్పుడైనా మనం తీపి సరైన మోతాదులో తినడం వల్ల బరువు తక్కువ కాకుండా.. అధిక బరువు పెరగకుండా కాపాడుతుందట. ఇష్టం కదా అని శృతిమించితే ఊబకాయం బారిన పడక తప్పదనే అంటున్నారు నిపుణులు

*అధిక రక్తపోటు

హైబీపీ, లోబీపీ అనేవి ఈరోజు వయసుతో సంబంధం లేకుండా వస్తున్న సమస్యలు. వెన్న, మాంసం, ఫ్రై చేసిన ఆహారం లాంటివి తీసుకోవడం వల్ల మీ రక్తపోటు పెరుగుతుంది. అయితే ఇవే కాకుండా షుగర్ ఎక్కువగా తనడం వల్ల బరువు పెరిగి.. మీకు అధికరక్తపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఎనర్జీ డ్రింక్స్, సోడా లాంటి వాటిలో షుగర్ శాతం ఎక్కువగా ఉంటున్నాయట.  

*గుండె జబ్బులు

అమెరికా లాంటి దేశాల్లో ఎక్కువ మంది గుండె జబ్బులతోనే చనిపోతున్నారు. ఎక్కువ తీపి తినడం వల్లే అధిక బరువు పెరిగి, డయాబెటీస్ తో పాటు గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయని నిపుణలు చెబుతున్నారు. 

*క్యాన్సర్

సైంటిస్టులు చెబుతున్న విషయం ఏంటంటే.. ఎక్కువ షుగర్ తీసుకోవడం వల్ల కొలన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేఅవకాశాలున్నాయట. కొలన్ క్యాన్సర్ ఎక్కువ శాతం మగవారిలో వస్తుందని చెబుతున్నారు.

*డెమెన్షియా

ఒబెసిటీ, టైప్-2 డయాబెటీస్ అనేవి కాగ్నినివ్ డిక్లైన్, డెమెన్షియా, అల్జీమర్స్ లాంటి వ్యాధులకు దోహదపడుతుంటాయి. చెక్కర తక్కువ తినడం వల్ల డెమెన్షియా, అల్జీమర్స్ వ్యాదులకు దూరంగా ఉన్నవారమవుతాం. 

*వ్యవసం

యువత ఈ మధ్య డ్రగ్స్ బారిన పడి కొకైన్ లాంటి వాటికి బానిసలుగా మారుతున్నారు. దీంట్లో కలిపే షుగర్ ప్రభావం డైరెక్ట్ గా మన బ్రెయిన్ మీద పడుతుందట.

  వీలైనంత వరకూ ఈ విషయాల్లో జాగ్రత్తవహించి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. వారెన్ బఫెట్ సంచలన నిర్ణయాలు...

ముగ్గురు భార్యల సహకారంతో నాలుగో పెండ్లికి సిద్ధమైన భర్త....!

 లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.