కడిగిన చేతులనే మళ్లీ మళ్లీ కడగడం, వేసిన తాళాన్ని పదిసార్లు లాగి చూసుకోవడం.. ఇవన్నీ ఓసీడీ లక్షణాలు. అదే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ( ఓసీడీ ). మహానుభావుడు సినిమాలో ఇలాంటి మానసిక వ్యాధితో బాధపడే పాత్రలో శర్వానంద్ నటిస్తే నవ్వుకున్నాం.. కానీ సాధారణంగా కనిపించే ఈ రుగ్మత అత్యంత ప్రమాదకరమని, ఒక్కోసారి ప్రాణంతకం కావచ్చని తైవాన్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
యాభై వేలమందిని గమనించిన మీదట, ఓసీడీ సమస్య ఉన్నవారిలో ఇస్కెమిక్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఏకంగా మూడు రెట్లు అధికమని తేల్చారు. రక్తం గడ్డ కట్టడం వల్ల మెదడుకు రక్త సరఫరాలో లోపం తలెత్తడాన్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటారు. పక్షవాతానికి ఇదో ముఖ్య కారణం. ఓసీడీ సమస్య ఉన్నవారు మద్యం, సిగరెట్ లాంటి వ్యసనాలకు దూరంగా ఉన్నా, మంచి జీవన విధానాన్ని అలవర్చుకున్నా, రక్తపోటును నియంత్రించుకున్నా ఈ సమస్య కనిపించడం విచిత్రం. ఓసీడీకీ, పక్షవాతానికీ మధ్య సంబంధానికి కారణం ఏమిటన్నది మాత్రం పరిశోధకులు చెప్పలేక పోతున్నారు. ఓసీడీవల్ల మెదడులో నిత్యం అలజడి చెలరేగుతూ ఉండటమే పక్షవాతానికి దారితీస్తున్నదేమో!
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పుచ్చకాయ కొంటున్నారా? ఇవి తెలుసుకోండి
ఈ ఐదింటిని డైట్లో చేర్చుకుంటే రక్తహీనత మాయం..!
మధుమేహులకు శుభవార్త : పాక్లో చక్కెర లేని మామిడి పండ్లు
షుగర్ ఉన్నోళ్లు ఈ పండ్లు తినొచ్చా
బట్టలు తెల్లగా మెరవాలా? ఇలా ట్రై చేయండి