శుక్రవారం 04 డిసెంబర్ 2020
Health - Oct 31, 2020 , 16:13:52

నారింజ పండు తొక్కను పడేయకండి.. వాటితో కలిగే లాభాలివే..!

 నారింజ పండు తొక్కను పడేయకండి.. వాటితో కలిగే లాభాలివే..!

హైదరాబాద్ :నారింజ పండ్లలో ఉండే విటమిన్ సి మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని అందరికీ తెలిసిందే. దాంతోపాటు అనేక పోషకాలు మనకు నారింజ పండ్లను తినడం వల్ల అందుతాయి. అయితే కేవలం నారింజ పండ్లే కాదు, ఆ పండ్లకు చెందిన తొక్కలు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. వాటితో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. నారింజ పండు తొక్కను గాయాలు, ఇన్‌ఫెక్షన్‌కు గురైన శరీర భాగాలపై రాయాలి. దీంతో ఆయా సమస్యలు తగ్గుతాయి. నారింజ పండు తొక్కలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్లే గాయాలు, ఇన్‌ఫెక్షన్లు త్వరగా తగ్గుతాయి.

2. క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడే గుణాలు నారింజ పండు తొక్కలో ఉంటాయి. శరీరంలో ఉండే క్యాన్సర్ కణాలను నాశనం చేసే శక్తి ఆ తొక్కలోని పాలీమిథాక్సీఫ్లేవోన్స్ అనబడే ఫ్లేవనాయిడ్లలో ఉంటాయి. అందువల్ల నారింజ పండు తొక్కను ఏదో ఒక రూపంలో తీసుకుంటే క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు.

3. నారింజ పండు తొక్కలో 61 నుంచి 69 శాతం వరకు ఫైబర్ ఉంటుంది. అందులో 19 నుంచి 22 శాతం వరకు సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది మన శరీరానికి ఎంతో అవసరం. జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఈ ఫైబర్ ఎంతగానో మేలు చేస్తుంది.

4. నారింజ పండు తొక్కలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల గుండె జబ్బులు, అల్జీమర్స్, డయాబెటిస్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.

5. మొటిమల సమస్య ఉన్నవారు వాటిపై నారింజ పండు తొక్కలను నిత్యం మర్దనా చేస్తుంటే ఆ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.