శుక్రవారం 30 అక్టోబర్ 2020
Health - Oct 17, 2020 , 17:32:56

బార్లీ గడ్డి జ్యూస్ రోజూ తాగితే.. ఎన్ని లాభాలో..!

 బార్లీ గడ్డి జ్యూస్ రోజూ తాగితే.. ఎన్ని లాభాలో..!

హైదరాబాద్: గోధుమగడ్డి లాగానే బార్లీ గడ్డిలోనూ ఎన్నో పోషకాలు ఉంటాయి. బారీ గడ్డిలో మన శరీరానికి కావల్సిన అమైనో యాసిడ్లు, క్లోరోఫిల్, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. వీటి వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు. అలాగే శరీర రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈ క్రమంలో బార్లీ గడ్డి జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

* బార్లీ గడ్డిలో ఉండే ఫ్లేవనాయిడ్లు అనబడే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో ఉత్పన్నమయ్యే ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. దీంతోపాటు మనం తినే ఆహారం నుంచి శక్తి ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చూస్తాయి. అలాగే శరీర కణజాలాన్ని రక్షిస్తాయి. క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధులు రాకుండా చూస్తాయి.

* డిప్రెషన్ సమస్యతో బాధపడేవారు బార్లీ గడ్డి జ్యూస్‌ను నిత్యం తాగుతుంటే ఫలితం ఉంటుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. బార్లీ గడ్డిలో ఉండే న్యూరోట్రోఫిన్ అనబడే సమ్మేళనం డిప్రెషన్ బారి నుంచి కాపాడుతుంది.

* బార్లీ గడ్డి జ్యూస్‌ను సేవించడం వల్ల షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. కిడ్నీ వ్యాధులు, కంటి చూపు సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే డయాబెటిస్ లేని వారిలో ఆ వ్యాధి రాకుండా ఉంటుంది.

* మలబద్దకం సమస్యతో బాధపడేవారు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, అధిక బరువును వేగంగా తగ్గించుకోవాలనే వారు నిత్యం బార్లీ గడ్డి జ్యూస్ తాగితే మంచి ఫలితాలు వస్తాయి. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.