యాలకులతో ఎన్ని లాభాలో..!

హైదరాబాద్ :యాలకులు మన ఆహారానికి మంచి సువాసన అందించడంతో పాటు.. జీర్ణ శక్తి పెంచేందుకు సహాయపడతాయి. సహజంగా శరీరానికి చలువ చేసే గుణం వీటికి ఉంటుంది. అందుకనే.. మసాల దినులతో పాటు వీటిని రకరకాల వంటల్లో ఉపయోగిస్తారు. సేమియా, పరమాన్నం లాంటి వాటిల్లో కూడా యాలకుల పొడి వేస్తుండటం అనాదిగా వస్తుంది. అయితే యాలకులతో ఎన్నోఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవి...
-యాలకుల గింజలలో టర్పనైన్, లిమొనెన్, టెర్పినోల్ లాంటి రసాయనాలు ఉంటాయి. వీటిని సంప్రదాయ వైద్యంలో అనేక రుగ్మతలకు మందుగా వాడతారు.
-అజీర్తి, మలబద్దకం, అల్సర్, ఆస్థమా, జలుబు, సైనస్ మొదలైన వ్యాధుల్లోను, తలనొప్పిలతో పాటు నోటి దుర్వాసన మొదలైన వాటి చికిత్సలో యాలకుడ పొడిని వాడతారు.
ఈ మధ్య కాలంలో చాలా మంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఆకలి కాకపోవడం, అధికంగా దాహం వేయడం లాంటి సమస్యలతో బాధపడుతున్నారు. వీటన్నింటికి ఇలాచీ టీ తో చెక్ పెట్టొచ్చట. అదెలాగో చూద్దాం..
* చాలా మందిలో హార్మోన్ల అసమతుల్యత ఉంటుంది. జన్యుపరమైన కారణాలు లేక ఒత్తిడి లాంటి ఇతర కారణాల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. అలసట, ఆందోళన, సంతానలేమి, అధిక బరువు లాంటివి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లక్షణాలు. వీటన్నింటినీ దూరం చేసేందుకు ఇలాచీ టీ బాగా ఉపయోగపడుతుంది.
*నీరు ఎక్కువ సార్లు తాగుతున్నప్పటికీ చాలా మందికి మళ్లీ మళ్లీ దాహం వేస్తుంటుంది. నోరు పొడిబారి నట్టుగా అనిపిస్తుంది. ఇలాంటి వారు ఇలాచీతో చేసిన టీ ని తాగి చూడండి. మీ సమస్య తగ్గుతుంది.
*అలాగే.. ఆకలి వేయకపోవడం, బాగా ఆకలి వేయడం లాంటివి మీకు అనిపించినప్పడు.. ప్రతి రోజు అన్నం తినడానికి గంట ముందు ఇలాచీ టీ తాగండి. దీని వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- కాంట్రాక్టు అధ్యాపకులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
- వారానికి 4 రోజులే.. కరోనా టీకా
- సిటిజన్ కాప్స్
- ప్రయాణం ఏదైనా కార్డు ఒక్కటే..
- వైద్య శిబిరాలను వినియోగించుకోవాలి
- మహేశ్వరం మండలానికి నాలుగులేన్ల రోడ్డు
- బాధిత కుటుంబాలకు భరోసా..
- సీబీఎస్‌లో సౌకర్యవంతంగా...
- దోమలపై ఎంటమాలజీ యుద్ధం
- పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి