గుమ్మడికాయలతో కొలెస్ట్రాల్‌కు చెక్..!


Mon,December 24, 2018 03:16 PM

ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న గుమ్మడి కాయల్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి తీపి గుమ్మడి. మరొకటి బూడిద గుమ్మడి. బూడిద గుమ్మడి కాయలను దిష్టి తీసేందుకు వాడుతారు. ఇక తీపి గుమ్మడితో రక రకాల వంటకాలు చేసుకుని చాలా మంది తింటుంటారు. ఈ క్రమంలోనే ఈ రకానికి చెందిన గుమ్మడి కాయలతో మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. గుమ్మడికాయల్లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల చర్మం సంరక్షింపబడుతుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది.

2. గుమ్మడికాయల్లో ఉండే విటమిన్ సి డయాబెటిస్ రాకుండా ఉండేందుకు దోహదపడుతుంది. వచ్చిన వారికి దాన్ని అదుపులో ఉంచుకునేందుకు సహాయపడుతుంది. ఈ కాయల్లో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. తద్వారా అధిక బరువు తగ్గుతారు. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

3. గుమ్మడి విత్తనాలను ఎండబెట్టి పొడి చేసి నీళ్లలో కలిపి తాగితే మూత్ర సంబంధ వ్యాధులు తగ్గుతాయి. ఇక నిత్యం గుమ్మడికాయ విత్తనాలు తింటే శరీరంలో కొవ్వు చేరకుండా ఉంటుంది.

4. గుమ్మడికాయ లేదా దాని విత్తనాలను నిత్యం తింటుంటే మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారికి వీటితో ఉపశమనం లభిస్తుంది.

5. గుమ్మడికాయలను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు.

2642
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles