శనివారం 19 సెప్టెంబర్ 2020
Health - Apr 23, 2020 , 17:22:20

ఎండలు మండుతున్నాయ్‌..వాటర్‌మిలన్‌ తినడం మరవకండి

ఎండలు మండుతున్నాయ్‌..వాటర్‌మిలన్‌ తినడం మరవకండి

గ‌త వారం రోజుల నుంచి రాష్ట్రంలో ఎండ‌లు మండిపోతున్నాయి.  లాక్‌డౌన్‌ వల్ల అందరూ ఇంటిపట్టునే ఉన్నందుకు ఎండ తీవ్రత తెలువట్లేదు.  అయితే ఎండ‌లో తిరిగే వారు ఎవ‌రైనా స‌రే.. ఒంట్లో నుంచి నీరు ఎక్కువ‌గా బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా చూసుకోవాల‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. లేదంటే డీ హైడ్రేష‌న్‌కు గురై ఎండ దెబ్బ త‌గులుతుంద‌ని అంటున్నారు. 

వేస‌విలో బ‌య‌ట ఎండ‌కు ఎంత తిరిగినా.. ఒంట్లో నుంచి నీటిని బ‌య‌టికి పోకుండా చూసుకుంటే చాలు, ఎండ‌దెబ్బ త‌గ‌ల‌కుండా ఉంటుంది. అయితే ఎండ‌ల్లో తిరిగేవారు పుచ్చ‌కాయ‌ల‌ను ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల లాభ‌ముంటుంద‌ని వైద్యులు చెబుతున్నారు. పుచ్చ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కేవ‌లం నీరు మాత్ర‌మే కాదు, ప‌లు పోషకాలు కూడా అందుతాయి. ముఖ్యంగా శక్తిని కోల్పోకుండా ఉండేందుకు ఎల‌క్ట్రోలైట్లు, సుక్రోజ్‌, ఫ్ర‌క్టోజ్‌, గ్లూకోజ్‌లు అందుతాయి. దీంతో నీర‌సం, అల‌స‌ట రాకుండా ఉంటాయి. అలాగే పుచ్చ‌కాయ‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి నీరు కూడా పుష్క‌లంగా అందుతుంది క‌నుక డీహైడ్రేష‌న్‌కు గురి కాకుండా చూసుకోవ‌చ్చు. క‌నుక ఎండ‌లో తిరిగే వారు క‌చ్చితంగా పుచ్చ‌కాయ‌ల‌ను తినాల‌ని వైద్యులు సూచిస్తున్నారు.


logo