మ‌న శ‌రీరానికి సెలీనియం ఎందుకు అవ‌స‌ర‌మంటే..?

Wed,March 20, 2019 03:29 PM

మన శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన పోష‌కాల్లో సెలీనియం కూడా ఒక‌టి. ఇది యాంటీ ఆక్సిడెంట్ల జాబితాకు చెందుతుంది. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క మిన‌ర‌ల్స్‌లో సెలీనియం ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ క్ర‌మంలోనే సెలీనియం ఉన్న ఆహారాల‌ను మ‌నం నిత్యం తీసుకోవాలి. దాంతో మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటంటే...


1. సెలీనియం ఉన్న ఆహారాల‌ను తింటే సంతాన స‌మ‌స్య‌లు పోతాయి. క్యాన్స‌ర్ క‌ణాలు పెర‌గ‌కుండా ఉంటాయి. అందువ‌ల్ల క్యాన్స‌ర్లు రాకుండా చూసుకోవ‌చ్చు.

2. సెలీనియం ఉన్న ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల టైప్ 2 డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి.

3. థైరాయిడ్ స‌మ‌స్య ఉన్న‌వారు సెలీనియం ఉన్న ఆహారాల‌ను తింటే ఫ‌లితం ఉంటుంది.

4. ఇన్‌ఫెక్ష‌న్లతో బాధ‌ప‌డేవారు, రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న‌వారు.. నిత్యం సెలీనియం ఉన్న ఆహారాల‌ను తింటుంటే ఆయా స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు.

మ‌న‌కు సెలీనియం చేప‌లు, బీఫ్‌, చికెన్‌, కోడిగుడ్లు, చీజ్‌, బ్రౌన్ రైస్‌, హోల్ వీట్ బ్రెడ్‌, ఓట్ మీల్, పుట్ట గొడుగులు, గుమ్మ‌డికాయ, పొద్దు తిరుగుడు విత్త‌నాలు, రొయ్య‌లు.. త‌దిత‌ర ఆహారాల్లో పుష్క‌లంగా ల‌భిస్తుంది. వీటిని త‌ర‌చూ తీసుకుంటే సెలీనియం లోపం లేకుండా చూసుకోవ‌చ్చు..!

2524
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles