e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home News సీమచింతకాయ ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా…?

సీమచింతకాయ ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా…?

సీమచింతకాయ ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా…?

హైదరాబాద్ ,మే 24: సీమ చింతకాయ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేసవిలో ఇవి అందుబాటులో ఉంటాయి. ఇవి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందిస్తాయి కూడా. సీమ చింతకాయల్లో పీచు పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. ప్రోటీన్లు కూడా ఎక్కువుగా ఉంటాయి. కొవ్వు పదార్ధాలు చాలా తక్కువుగా ఉండడం వల్ల గుండె సమస్యలు దరి చేరవు. అంతేకాదు వీటిలో విటమిన్ బి1, బి2, బి6, ఏ, సి విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఖనిజ లవణాలు కూడా ఎక్కువే. వీటిని తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

సీమ చింతకాయలు తినడం వల్ల డిప్రెషన్ తగ్గి మనసుకు ఉల్లాసంగా ఉంటుందట. ఈ విషయం పరిశోధనల్లో కూడా రుజువైంది. ఇవి ప్రెగ్నెన్సీ మహిళలకు కూడా చాలా మంచిది. వారికీ కావాల్సిన అన్ని పోషకాలు వీటిలో ఉండడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు చక్కగా అందుతాయి. పుట్టబోయే బిడ్డకు కూడా చాలా మంచిది. అందానికి కూడా చక్కని పరిష్కారం. ఇవి చర్మం పై వచ్చే ముడతలను తగ్గించి తాజాగా ఉండేలా చేస్తాయి.

సీమ చింతకాయ తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అంతేకాదు ఎముకలను దృడంగా మారుస్తాయి. మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్పరస్, థైమిన్ కూడా మెండుగా ఉంటాయి. వీటిని తినడం వల్ల దంతాలు శుభ్ర పడుతాయి. కంటి సమస్యలను కూడా మెరుగు పరుస్తాయి. అలాగే బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచి షుగర్ రాకుండా కాపాడుతుంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సీమచింతకాయ ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా…?

ట్రెండింగ్‌

Advertisement