శనివారం 27 ఫిబ్రవరి 2021
Health - Jan 17, 2021 , 20:21:20

కారంపొడి తింటే బరువు తగ్గుతారా..!

కారంపొడి తింటే బరువు తగ్గుతారా..!

బరువు తగ్గాలంటే ముఖ్యంగా చేయాల్సింది క్యాలరీలను కరిగించుకోవడం. ఇది కేవలం రోజు చేసే శారీరక శ్రమ వల్ల సాధ్యమవుతుందని నమ్ముతారు. అయితే కేవలం ఫిజిక‌ల్ ఎక్స‌ర్‌సైజ్‌తో   కిలోల్లో బరువు తగ్గడం సాధ్యమా అంటే చెప్పలేమనే అంటున్నారు నిపుణులు. బ‌రువు త‌గ్గ‌డంలో  కారం పొడి సహాయపడుతుందా   అంటే కచ్చితంగా అని చెబుతున్నారు ఆహార నిపుణులు.

కారం పొడి బరువు తగ్గిస్తుందా..?

కారం పొడిని   వంటల్లో  వాడుతుంటాం. బరువు తగ్గాలనుకునేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ప్రతి పూట మనం తినే ఆహారంలో కారం పొడి చేర్చుకోవడం వల్ల కొన్ని క్యాలరీలను కరిగించుకున్న వాళ్లమవుతామని స్టడీలు చెబుతున్నాయి.

ఎలా తగ్గిస్తుంది..

కారం పొడిలోని క్యాప్సైసిన్ అనే బయో యాక్టివ్ ప్లాంట్ కాంపౌండ్ వంటలకు రుచిని అందించడంతో పాటు రకరకాల ఆరోగ్య ప్రయోజనాలకు కారకంగా పనిచేస్తుంది. అలాగే దీంట్లో విటమిన్-సి, విటమిన్-బి6, విటమిన్-కె1, పొటాషియం, కాపర్ లాంటి న్యుట్రియన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. 

కారంపొడి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

1. క్యాప్సైసిన్ తీసుకోవడం వల్ల మెటబాలిజమ్ పెంచేందుకు, ఫ్యాటీ టిష్యూను తగ్గించుకునేందుకు, మీ ఆకలిని అరికట్టేందుకు కూడా సహాయపడుతుంది.   

2. అలాగే కారంపొడిలోని థర్మోజెనిక్ ఎఫెక్ట్ మనం తినే స్పైసీ ఫుడ్ ను ఆర‌గించేందుకు శరీరానికి కావాల్సిన వేడిని అందిస్తుంది. అలాగే ఇది ఎక్కువ కేలరీలను కరిగించేందుకు తోడ్పడుతుంది. 

3. కారంపొడి బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచేందుకు, రక్త ప్రసరణ బాగుండేందుకు అలాగే సోరియాసిస్ లక్షణాలను మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుంది.

అయితే కారంపొడి శరీరానికి కొంచెం వేడి కలిగించేందుకు దీన్ని ఎక్కువగా తినడం వల్ల కడుపులో నొప్పి, మంట లాంటి అరుగుదల సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి మితంగా తినడం ఆరోగ్యానికి ఎంత మంచిదో అమితంగా తినడం అంత హానికరం.

VIDEOS

logo