బొప్పాయి పండే కాదు, ఆకులు కూడా మనకు ఎంతగానో మేలు చేస్తాయి. బొప్పాయి ఆకుల నుంచి తీసిన రసం తాగుతుంటే రక్తంలో ప్లేట్లెట్లు పెరుగుతాయని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా డెంగీ జ్వరం వచ్చిన వారికి బొప్పాయి ఆకుల రసం తాగిస్తారు. దీని వల్ల ప్లేట్లెట్లు పెరగడమే కాదు, రక్తం వృద్ధి చెందుతుంది. త్వరగా జ్వరం నుంచి కోరుకుంటారు కూడా. అయితే కేవలం డెంగీ జ్వరానికి, ప్లేట్లెట్లకే కాదు, బొప్పాయి ఆకుల రసం మరెన్నో అనారోగ్య సమస్యలకు కూడా ఔషధంగా పనిచేస్తుంది. మరి ఈ ఆకుల రసం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. రోజూ బాగా పనిచేసేవారు, సాయంత్రానికి అలసట చెందేవారు బొప్పాయి ఆకుల రసం తాగాలి. దీంతో శక్తి వస్తుంది. అలసి పోకుండా ఉత్సాహంగా ఉంటారు. 2. మధుమేహం తగ్గుతుంది. రక్తంలో ఉండే షుగర్ స్థాయిలు కంట్రోల్ అవుతాయి. 3. జాండిస్, లివర్ వ్యాధులు వచ్చిన వారు నిత్యం బొప్పాయి పండు ఆకుల రసం తాగుతుంటే త్వరగా కోలుకుంటారు. 4. గుండె సమస్యలు, హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. రక్త నాళాల్లో ఉన్న కొవ్వు కరుగుతుంది. రక్త సరఫరా మెరుగుపడుతుంది. 5. రుతు సమయంలో మహిళలకు వచ్చే ఇబ్బందులు తప్పుతాయి. 6. జీర్ణాశయం సరిగ్గా పనిచేస్తుంది. జీర్ణాశయం, పేగులు శుభ్రమవుతాయి. వాటిల్లో ఉండే క్రిములు చనిపోతాయి. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం ఉండవు. 7. నొప్పులు, వాపులు తగ్గుతాయి. గమనిక: బొప్పాయి ఆకుల రసాన్ని చాలా అత్యల్ప మోతాదులో తాగాల్సి ఉంటుంది. ఎక్కువ తాగితే వాంతులు, విరేచనాలు, తల తిరగడం వంటి అనారోగ్య సమస్యలు సంభవించి ఆస్పత్రి పాలు కావల్సి వస్తుంది.