బొప్పాయి ఆకుల‌తో క‌లిగే అద్భుత‌మైన లాభాలివే..!


Mon,September 10, 2018 06:49 PM

బొప్పాయి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన విట‌మిన్లు, పోష‌కాలు ఈ పండ్ల వ‌ల్ల మ‌నకు అందుతాయి. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టే గుణాలు కూడా బొప్పాయి పండ్ల‌లో ఉంటాయి. అయితే కేవ‌లం బొప్పాయి పండ్లు మాత్రమే కాదు, వాటి ఆకుల వల్ల కూడా మ‌న‌కు ఎన్నో ఆరోగ్యక‌ర‌ ప్రయోజనాలు క‌లుగుతాయి. అవేమిటంటే...

1. బొప్పాయి ఆకుల గుజ్జు తలకు రాసుకోవడం వల్ల వెంట్రుకలు బాగా పెరుగుతాయి. నేచురల్‌ కండిషనర్‌గా పనిచేస్తూ శిరోజాలను కాంతిమంతంగా ఉంచుతాయి.

2. బొప్పాయి ఆకుల్లో పపైన్‌, కైమోపపైన్‌లాంటి ఎంజైములు ఎన్నో ఉన్నాయి. అందువ‌ల్ల బొప్పాయి ఆకులతో చేసిన జ్యూసు తాగితే శరీరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది. అందుకే డెంగ్యూ సోకిన వారికి ఈ జ్యూస్ తాగిస్తారు.

3. బొప్పాయి ఆకుల్లో యాంటీ-మలేరియా గుణాలున్నాయి. వీటిలోని యాక్టోజెనిన్‌ విష జ్వరాలు రాకుండా కాపాడుతుంది. కాలేయాన్ని శుభ్రం చేయడంలో ఇది క్లీనింగ్‌ ఏజెంటుగా పనిచేస్తుంది.

4. లివర్‌ సిరోసిస్‌, ఇతర కాలేయ జబ్బుల్ని నివారించే గుణాలు బొప్పాయి ఆకుల్లో ఉంటాయి. ఈ ఆకుల‌తో చేసిన జ్యూస్‌ను కొద్ది ప‌రిమాణంలో తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణక్రియ బాగా జరగడమే కాకుండా మలబద్ధకం కూడా తగ్గుతుంది.

5. బొప్పాయి ఆకుల్లోని యాంటి-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పేగులోని, పొట్టలోని మంటను తగ్గిస్తాయి. బొప్పాయి ఆకుల జ్యూసు పెప్టిక్‌ అల్సర్లను కూడా తగ్గిస్తుంది.

6. మధుమేహ వ్యాధిగ్రస్తులకు బొప్పాయి ఆకులు మేలు చేస్తాయి. ఇవి శరీరంలో ఇన్సులిన్‌ ఉత్పత్తిని క్రమబద్ధీకరిస్తాయి. బొప్పాయి ఆకుల‌లోని యాంటాక్సిడెంట్లు కిడ్నీ దెబ్బతినకుండా కాపాడడంతో పాటు ఫ్యాటీ లివర్‌ సమస్యను నివారిస్తాయి.

7. బొప్పాయి ఆకుల జ్యూసు ఆడవాళ్లకు బహిష్టు సమయంలో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది. బొప్పాయి ఆకుల్లో విటమిన్‌-సి, విటమిన్‌-ఎ లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ జ్యూసు తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఎంతో కాంతిమంతంగా ఉంటుంది.

19661
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles