రోజూ ఒక క‌ప్పు తుల‌సి ఆకుల టీ తాగితే..?


Sat,August 12, 2017 07:33 PM

తుల‌సి ఆకుల్లో ఎన్నో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ని అంద‌రికీ తెలిసిందే. అవి మ‌న‌కు క‌లిగే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేస్తాయి. శ‌రీరానికి ఉత్తేజాన్ని, శ‌క్తిని ఇస్తాయి. ఈ క్ర‌మంలోనే రోజూ ఉద‌యాన్నే ఒక క‌ప్పు తుల‌సి ఆకుల టీ తాగితే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

తుల‌సి ఆకుల టీ త‌యారీ విధానం...


కొద్దిగా అల్లం, 1/4 టీస్పూన్ వాము, 1/4 టీస్పూన్ జీల‌క‌ర్ర‌, తులసి ఆకులు కొన్ని, 1/2 టీస్పూన్ మిరియాలు, త‌గినంత బెల్లం తీసుకోవాలి. ఒక గిన్నెలో త‌గిన‌న్ని నీరు పోసి అందులో పైన చెప్పిన ప‌దార్థాల‌న్నింటినీ వేసి టీలాగా మ‌రిగించాలి. అలా 10-15 నిమిషాల పాటు మ‌రిగాక ఆ మిశ్రమాన్ని వ‌డ‌క‌ట్టి వేడిగా ఉండగానే తాగేయాలి.

తుల‌సి ఆకుల టీ రోజూ తాగ‌డం వ‌ల్ల క‌లిగే లాభాలు...


* శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్లు తగ్గిపోతాయి. జ‌లుబు, జ్వ‌రం, ద‌గ్గు వెంట‌నే త‌గ్గుతాయి.
* ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి. మ‌ధుమేహం ఉన్న‌వారికి మంచి చేస్తుంది.
* ఈ టీలో ఉండే పొటాషియం మెదడులో సెరోటినిన్ లెవల్స్ ను పెంచుతుంది. దీంతో డిప్రెషన్ త‌గ్గిపోతుంది. ఒత్తిడి, ఆందోళ‌న దూర‌మ‌వుతాయి.
* యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉండ‌డం వ‌ల్ల చ‌ర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.
* ర‌క్త స‌ర‌ఫరా మెరుగు పడుతుంది. బీపీ కంట్రోల్ అవుతుంది. గుండె స‌మ‌స్య‌లు రావు.
* జీర్ణ స‌మ‌స్య‌లు పోతాయి. గ్యాస్‌, అసిడిటీ ఉండ‌వు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.
* కిడ్నీల్లో రాళ్లు క‌రిగిపోతాయి.

5384

More News

VIRAL NEWS

Featured Articles