మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Health - May 09, 2020 , 16:06:42

పీచులో ఉందిలే మజా...

పీచులో ఉందిలే మజా...

పీచు అంటే కొబ్బరి పీచో, ఇంకో పీచో కాదండి.. ఆహారంలో ఉండే పీచు పదార్థం. ఇది మనిషి శరీరంలో ఎన్నో మంచిపనులకు దోహదం చేస్తుంది. ఈనాటి యువత్‌కు అంతగా తెలియదు. ఒక వయసు వచ్చిన తర్వాతగాని తెలియదు పీచు గొప్పతనమేంటో. ఉదయాన్నే నంబర్‌2 రాకపోతే తెలుస్తుంది పీచు పనితనమేంటో. శరీరంలో పీచు పనేంటో చూద్దాం..

 పీచు పదార్థం తీసుకొన్నవాళ్ళకు ఆహారం జీర్ణమవడమేకాదు చర్మానికి కాంతి కూడా వస్తుంది. పీచుపదార్ధం కలిగిన ఆహారానికి నీటిని ఇముడ్చుకునే గుణం ఉంటుంది. దీనివల్ల  ఆహారం పేగులలో సులభంగా కదిలే వీలును కలిగిస్తుంది. పెద్ద ప్రేగులలో జీర్ణమైన తరువాత మిగిలిపోయన వ్యర్ధ పదార్ధాన్ని బయటకి పంపడానికి ఈ పీచు దోహదపడుతుంది. ఒక హైపో కోలెస్టర్ లిమిక్ ఏజెంట్ గా పనిచేస్తూ పిత్తరస లవణాన్ని (బైల్ సాల్ట్) బంధించి కొలెస్ట్రాల్ తగ్గుదలను మెరుగుపరుస్తుంది. గుండె సంబంధిత వ్యాధులలోఆహార నియమాలను, నిర్వహణను పాటిస్తూ వుండడంలో సహాయపడుతుంది. ఇతర తృణ ధాన్యాలకంటే బియ్యంలో పీచు పదార్ధాలు చాలా తక్కువ శాతంలో ఉంటాయి.

  • 35 గ్రాముల పీచు తింటే… మీకు కోవాన్‌క్యాన్సర్ 40 శాతం తగ్గినట్టే అంటున్నారు పీచు నిపుణులు.
  •  రోజూ పీచు 25 గాములు తప్పనసరిగా తినాలి. అప్పుడే మనకు జీర్ణక్రియ బాగా జరుగుతుంది. ఎలాంటి ఇబ్బందులు రావు. ఈ పీచు పదార్థం మనం తీసుకోకపోతే అనారోగ్యం పలుకరిస్తుంది.
  • పూర్వం బీరకాయ కూర చేసేటప్పుడు, బీరకాయ తొక్కు వృథా పోనిచ్చేవారు కారు. తొక్కు పచ్చడి ఉండేది… కేలరీలకు కేలరీలు. ఫైబర్‌కి ఫైబర్.
  • ముడిబియ్యం ఎక్కువ వాడండి. మైదా పిండికంటె చపాతీ పిండి, మొక్కజొన్న పిండి, జొన్నపిండిని బాగా వాడండి.
  • రాగి అన్నం, జొన్న అన్నం, ఇలా వెరైటీ ట్రై చెయ్యండి. ముదురు కూరగాయలు తినడం అలవాటు చేసుకోండి.
  • బీన్స్, బక్రా, పొట్టు ధాన్యాలు, ఓట్స్, ధాన్యంతో తయారయిన బ్రెడ్ వీటిల్లో పీచు అధికమోతాదులో ఉంటుంది.

పీచులేని ఆహారం..

 నూడిల్స్, పిజ్జాలు, బర్గర్లు, కెంటకీ చికెన్లు… వీటిలో పీచుపదార్థం ఏదీ ఉండదు. నోటికి టేస్ట్… ప్రేవులకు రెస్ట్. ఉదయాన్నెబాత్‌రూమ్‌లో తినుకులు. అందుకే  ప్యాకేజ్ ఆహారాన్ని పక్కన బెట్టండి. ఇవి ఫైబర్‌ని నాశనం చేస్తాయి.


logo