ఉపవాసం చేయడం వల్ల కలిగే లాభాలివే తెలుసా..?


Thu,October 11, 2018 10:22 AM

మన దేశంలో ఆయా వర్గాలకు చెందిన వారు తాము పూజించే దైవం కోసం ఉపవాసం ఉంటుంటారు. అలా చేస్తే పుణ్యం వస్తుందని భావిస్తారు. అలాగే కొందరు ఆరోగ్యం బాగుండాలని చెప్పి కూడా ఉపవాసం చేస్తుంటారు. అయితే నిజానికి ఉపవాసం చేయడం వెనుక ఉన్న కారణం ఏదైనప్పటికీ.. ఉపవాసం చేయడం వల్ల మనకు పలు లాభాలే కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఉపవాసం చేయడం వల్ల వృద్ధాప ఛాయలు అంత త్వరగా రావట. ఎందుకంటే ఉపవాసంలో ఉన్నప్పుడు మన శరీరం కొత్త కణాలను నిర్మించుకోవడంతోపాటు, పాత కణాలకు మరమ్మత్తులు చేసుకుంటుందట. దీంతో కణాలు నూతనోత్తేజాన్ని పొందుతాయి. ఇది యాంటీ ఏజింగ్ ప్రభావాన్ని కలిగిస్తుంది. దీంతో వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా రావు.

2. ఉపవాసం వల్ల మెదడు పనితీరు బాగా పెరుగుతుందట. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. అలాగే ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటారట.

3. ఉపవాసం చేస్తే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు లాంటి స్వల్ప అనారోగ్య సమస్యలు నయమవుతాయి.

4. అప్పుడప్పుడు ఉపవాసం చేస్తే క్యాన్సర్ కూడా నయమవుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఉపవాసం వల్ల క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి.

3697

More News

VIRAL NEWS