నిత్యం ప‌ప్పు దినుసుల‌ను తీసుకుంటే ఇన్ని లాభాలా..!

Fri,February 15, 2019 12:00 PM

భార‌తీయులు నిత్యం చేసుకునే వంట‌ల్లో పప్పు దినుసుల‌కు ఎంత‌గానో ప్రాముఖ్య‌త ఉంది. ఏ కూర‌గాయ‌లు లేకున్నా, వాటిని తిన‌బుద్ది కాకున్నా చాలా మంది ప‌ప్పుదినుసుల‌తో ప‌ప్పు చేసుకుని తింటారు. ఈ క్ర‌మంలోనే మ‌న‌కు కందిప‌ప్పు, పెస‌ర‌ప‌ప్పు.. అని ప‌లు ప‌ప్పు దినుసులు అందుబాటులో ఉన్నాయి. అయితే ప‌ప్పు దినుసులేనా అని వాటిని అంత తేలిగ్గా తీసిపారేయ‌కూడ‌దు. నిజానికి వీటిని రోజూ తీసుకోవాల్సిందే. ఈ క్ర‌మంలోనే నిత్యం ప‌ప్పు దినుసుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు, ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


1. ప‌ప్పు దినుసుల‌ను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే దాంతో కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల్లో తెలిసింది.

2. ప‌ప్పు దినుసుల్లో అధికంగా ఉండే ఫొలేట్‌, మెగ్నిషియం పోష‌కాలు గుండె ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షిస్తాయి. గుండె జ‌బ్బులు రాకుండా చూస్తాయి.

3. డ‌యాబెటిస్ ఉన్న‌వారు నిత్యం ప‌ప్పు దినుసుల‌ను తీసుకుంటే షుగ‌ర్ లెవ‌ల్స్‌ను కంట్రోల్ చేసుకోవ‌చ్చు.

4. ప‌ప్పు దినుసుల్లో ప్రోటీన్లు పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల శ‌రీరానికి శ‌క్తి ల‌భిస్తుంది.

5. ప‌ప్పు దినుసుల‌ను తిన‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం, డ‌యేరియా వంటి స‌మ‌స్యలు త‌గ్గుతాయి.

6. నిత్యం ప‌ప్పు దినుసుల‌ను తీసుకునే వారి బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంది. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

5005
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles