బుధవారం 23 సెప్టెంబర్ 2020
Health - Apr 18, 2020 , 13:08:25

తొక్కే కదాని పారేయకండి..

తొక్కే కదాని పారేయకండి..

మనలో చాలామందికి అరటి పండు తినడం ఎంత అలవాటో దాని తొక్కను పడేయడం అంతే అలవాటు. కానీ అరటి తొక్కతో చాలా ప్రయోజనాలున్నాయి.  ఆకులు, పండ్లు, పండ్లపై ఉన్న తొక్కభాగం నుంచి ఎక్కువగా పీచు పదార్థం లభిస్తుంది.  

-అరటి పండులోని తొక్కలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల సాఫీగా మలవిసర్జన అవుతుంది. -అరటి పండు తొక్కను తినలేకపోయినా దానిలోపలి భాగంలో ఉండే తెల్లని పదార్థాన్ని స్పూన్‌తో తినడం వల్ల కూడా ఫలితం ఉంటుంది.

-దంతాల మెరుపునకు అరటిపండు తొక్క లోపలి భాగాన్ని దంతాలపై రుద్దాలి. రెండు వారాల పాటు ఇలా చేయడం వల్ల దంతాలు తెల్లగా మెరుస్తాయి. 

-అరటి పండు తొక్కలోని లోపలి భాగాన్ని తినడం వల్ల రాత్రిళ్లు బాగా నిద్రపడుతుంది.

-వయసు పెరిగే కొద్ది కంటిచూపు మందగిస్తుంది. అరటిపండు తొక్క లోపలి భాగాన్ని తినడం వల్ల దృష్టి సంబంధ సమస్యలు తగ్గుతాయి. 

-అరటి తొక్కలో ల్యూటిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది అతి నీలలోహిత కిరణాల ప్రభావం నుంచి కంటిని కాపాడుతుంది.

-అరటి తొక్కలోని పీచు పదార్థాలు గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను కరిగిస్తాయి. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 

-పులిపిర్లపై అరటి తొక్కను ఉంచి దానిపైనుంచి బ్యాండ్ ఎయిడ్‌తో పట్టీలా వేయాలి. ఇలా కొద్దిరోజులు చేయడం వల్ల పులిపిర్లు తొలగిపోతాయి.


logo