శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Health - Jun 17, 2020 , 22:40:46

ఉద‌యాన్నే నిమ్మ‌ర‌సం తాగేవాళ్లు తెలుసుకోవాల్సిన నిజాలు!

ఉద‌యాన్నే నిమ్మ‌ర‌సం తాగేవాళ్లు తెలుసుకోవాల్సిన నిజాలు!

ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్య కరోనా వైరస్. వ్యాక్సిన్ రావడానికి కనీసం మరో 6 నెలలు పట్టేలా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో క‌రోనా బారిన ప‌డ‌కుండా ఉండేందుకు ఇమ్యునిటీ ప‌వ‌ర్‌ను పెంచుకోవాల‌ను వైద్యులు చెబుతున్నారు. విటమిన్-సి  లభించే ఆహార పదార్థాలు, పండ్లలో రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందులో నిమ్మ‌కాయ ముందుంటుంది. లెమ‌న్ జ్యూస్ తాగ‌డం వ‌ల్ల చాలా ఉప‌యోగాలున్నాయి.

నిమ్మ‌కాయ జ్యూస్ ఉప‌యోగాలు :

- ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కాస్త గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగితే మానసిక ఒత్తిడిని తగ్గించి నూతన ఉత్సాహాన్ని అందిస్తుంది.

- నిమ్మకాయ యాంటీసెప్టిక్‌గా పనిచేస్తుంది. దీనివల్ల వయసు పెరుగుతున్నా చర్మాన్ని త్వరగా ముడతలు పడనీయదు. నిమ్మలో దొరికినంత సి విటమిన్ పండ్లలోనూ లభించదు.

- పంటినొప్పిని తగ్గిస్తుంది. చిగుళ్ల నుంచి వెలువడే రక్తస్రావాన్ని సైతం నిమ్మ‌ర‌సం నియంత్రిస్తుంది. 

- శరీరంలో అతిముఖ్యమైన అవయవాలలో ఒకటైన కాలేయంలో పేరుకున్న విషపదార్థాలను సైతం నిమ్మకాయ తొలగిస్తుంది. కాలేయం పనితీరును మెరుగు పరుస్తుంది. 

- కొన్నిసార్లు పొరపాటున కలుషిత నీరు తాగి అనారోగ్యం బారిన పడితే.. నిమ్మరసం తాగిస్తే వారికి ఉపశమనం కలిగిస్తుంది. 

- బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకొని తాగుతారు. 

- కిడ్నీలో ఏర్పడే చిన్న చిన్న రాళ్లను నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ కరిగిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న కారణంగానే నిమ్మరసం తాగాలని వైద్యులు తరచుగా సూచిస్తుంటారు.


logo