బుధవారం 08 ఏప్రిల్ 2020
Health - Feb 19, 2020 , 14:48:06

లెమన్‌ గ్రాస్‌ టీని తాగడం వల్ల కలిగే లాభాలివే..!

లెమన్‌ గ్రాస్‌ టీని తాగడం వల్ల కలిగే లాభాలివే..!

మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు, పోషకాలు అందిచేందుకు మనకు తాగేందుకు అనేక రకాల టీలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో లెమన్‌ గ్రాస్‌ టీ కూడా ఒకటి. దీన్ని నిత్యం తాగడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


* లెమన్‌ గ్రాస్‌ టీని నిత్యం తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్‌, అసిడిటీ, మలబద్దకం సమస్యలు పోతాయి. 

* లెమన్‌గ్రాస్‌ టీలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఈ టీని తాగితే హార్ట్‌ ఎటాక్‌, స్ట్రోక్‌లు వచ్చేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. 

* లెమన్‌గ్రాస్‌ టీని తాగితే క్యాన్సర్‌ వ్యాధి బారిన పడకుండా చూసుకోవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. లెమన్‌గ్రాస్‌ టీలో ఉండే ఔషధ కారకాలు క్యాన్సర్‌ కణాలను నాశణం చేస్తాయి. దీంతోపాటు శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో క్యాన్సర్‌ రాకుండా ఉంటుంది. 

* శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో లెమన్‌ గ్రాస్‌ టీ అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే టైప్‌ 2 డయాబెటిస్‌ ఉన్నవారు ఈ టీని తాగితే శరీరంలో ఇన్సులిన్‌ లెవల్స్‌ పెరుగుతాయి. దీంతో షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయి. 

* నిద్రలేమి సమస్య ఉన్నవారు ఈ టీని తాగితే ఫలితం ఉంటుంది. అలాగే మానసిక ఒత్తిడి, ఆందోళన కూడా తగ్గుతాయి. 


logo