పెరుగుతో ఆరోగ్యం మెరుగు..


Mon,September 4, 2017 10:26 AM

పెరుగంటే మనలో చాలా మందికి ఇ ష్టమే. భోజనం చి వరలో ఎవరైనా సరే పెరుగు తినకుండా అస్సలు ఉండలేరు. పెరు గు తినడం వల్ల చాలా ఉపయోగా లు ఉన్నాయి. పె రుగులో ఆహార పదార్థాలు కలుపుకుని తింటే పలు రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.
* కొద్దిగా జిలకర్రను పొడి చేసుకోవాలి. దానిని ఒక కప్పు పెరుగులో కలుపుకుని తింటే త్వరగా బరువు తగ్గుతారు.
* కొంచెం నల్ల ఉప్పును తీసుకుని భాగా పొడిచేయాలి. దాన్ని కప్పు పెరుగులో కలుపుకుని తాగా లి. దీని వల్ల జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి. యాసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి.
* కొంచెం పెరుగులో చక్కెర కలుపుకుని తినాలి. ఇలా తినడం వల్ల శరీరాని కి వెంటనే శక్తి అందుతుంది. మూత్రాశాయ సంబంధ సమస్యల ఉంటే పోతాయి.
* కొంచెం వామును తీసుకుని ఒక కప్పు పెరుగులో కలుపుకుని తినాలి. దీని వల్ల నోటి పూత, పళ్లనొప్పి ఇతర దంత సంబంధ సమస్యలు పోతాయి.
* ఒక కప్పు పెరుగులో కొంత నల్ల మిరియాల పొడిని కలిపి తినాలి. దీని వ ల్ల మలబద్దకం దూరమవుతుంది. తిన్న ఆహారం కూడా సరిగ్గా దూరమవుతుంది.
* పెరుగులో కొన్ని ఓట్స్ కలుపుకుని తినాలి. దీని వల్ల ప్రో బయోటిక్స్, ప్రోటీన్లు లభిస్తాయి. ఇవి కండరాల పుష్టికి దోహదం చేస్తాయి.
* పెరుగులో వివిధ రకాల పండ్లను కలిపి తింటే రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. పలు రకాల ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా ఉంటాయి.
* పెరుగులో కొంత పసుపు, కొంచెం అల్లం కలిపి తినాలి. దీని వల్ల పోలిక్ యాసిడ్ శరీరంలోకి చేరుతుంది. ఇది పిల్లలకు, గర్బిణీలకు చాలా మంచింది.
* పెరుగులో ఆరెంజ్ జూస్ కలిపి తింటే శరీరానికి తగినంత విటమిన్ (సి) లభిస్తుంది. ఇది కీల నొప్పులను తగ్గిస్తుంది.
* పెరుగులో తేనె కలిపి తీసుకుంటే కడుపులో ఉన్న అల్సర్లు దూరమవుతా యి. ఆంటిబయోటిక్‌గా కూడా పని చేస్తుంది. దీని వల్ల శరీరంలో ఉన్న ఇన్‌ఫెక్షన్లు వెంటనే తగ్గిపోతాయి.

5143

More News

VIRAL NEWS

Featured Articles