గురువారం 01 అక్టోబర్ 2020
Health - May 05, 2020 , 21:19:58

వేస‌విలో శ‌రీర ఉష్ణోగ్ర‌త‌ ఎక్కువ‌గా ఉందా?

వేస‌విలో శ‌రీర ఉష్ణోగ్ర‌త‌ ఎక్కువ‌గా ఉందా?

అస‌లే వేస‌వి. అందులో క‌రోనా. శ‌రీరంలో ఎలాంటి మార్పులు వ‌చ్చినా అది క‌రోనాకు దారి తీయ‌వ‌చ్చు. అందుకే అనారోగ్యానికి గుర‌వ్వ‌కుండా కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ఏ స‌మ‌స్య రావ‌డానికైనా ముందు శ‌రీర ఉష్ణోగ్ర‌త మీదే అదార‌ప‌డి ఉంటుంది. అందుకే శ‌రీరంలో వేడి ఎక్కువ కాకుండా ఉండేందుకు కొన్ని మార్గాలున్నాయి. 

1. కొబ్బ‌రినీళ్లు తాగ‌డం వ‌ల్ల శ‌రీరం చ‌ల్ల‌బ‌డుతుంది. సీజ‌న్‌లో బోండాం రేట్లు మోత మోగుతుంద‌ని వాటికి దూరంగా ఉంటే హాస్పిట‌ల్ ఖ‌ర్చు అధికంగా ఉంటుంది. అందుకే హాస్పిట‌ల్‌కు పెట్టే ఖ‌ర్చుకంటే ఆహారం, పానీయాల‌కు పెడితే ఆరోగ్యంగా ఉంటార‌ని చెబుతున్నారు నిపుణులు.

2. ఇలాంటి స‌మ‌యంలో కొబ్బ‌రి నీళ్ల‌తో పాటు మ‌జ్జిగ‌, గ్లూకోజ్ వాట‌ర్‌, నిమ్మ‌ర‌సం, ఎండు ఖ‌ర్జూరం నాన‌బెట్టిన నీరు, స‌గ్గు బియ్యం కాచిన నీరు ఇలా ఏవైనా స‌రే తీసుకుంటే మంచిది.

3. అదేవిధంగా నీటిని వేడి చేసి అందులో చిటికెడు ఉప్పు, స్పూన్ చ‌క్కెర వేసుకొని తాగితే ఓఆర్ఎస్‌లా ప‌నిచేస్తుంది.

4. ప‌ల్లెల్లో ఉండేవారికి తాటిముంజులు అందుబాటులో ఉంటాయి. ఇవి కూడా ఆరోగ్యానికి మంచే చేస్తాయి. ముంజులు తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. అందుకే సీజ‌న‌ల్ ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిది అంటుంటారు.

5. అన్నింటిక‌న్నా ముఖ్య‌మైన‌ది ఏంటంటే కొబ్బ‌రి నీటిలో గ్లూకోజ్ క‌లుపుకొని తాగ‌డం వ‌ల్ల అల‌స‌ట‌, నీర‌సం త‌గ్గిపోతుంది. అంతేకాదు కిడ్నీ రాళ్ల స‌మ‌స్యలు, గుండె సంబంధిత స‌మ‌స్య‌లు, ఊపిరితిత్తులు స‌మ‌స్య‌లు, మూత్ర‌పిండ స‌మ‌స్య‌లు దూరం అవుతాయి. 

6. సూర్య‌ర‌శ్మికి ఎక్కువ‌గా తిరిగితే త్వ‌ర‌గా డీహైడ్రేష‌న్ స‌మ‌స్య వ‌స్తుంది. అలాంట‌ప్పుడు ఈ కొబ్బ‌రి నీటిని తీసుకోవ‌డం ఉత్త‌మం.

7. బొండంలో ఉండే లేత‌కొబ్బ‌రి తిన‌డం వ‌ల్ల కూడా మంచే జ‌రుగుతుంది. దీంతో శ‌రీరంలోని కొవ్వుని దూరం చేయ‌వ‌చ్చు. బ‌రువు త‌గ్గాల‌నుకునేవారికి దీనికి ఆహారంలో క‌లుపుకోవ‌చ్చు.


logo