నల్ల ద్రాక్షతో నిండైన ఆరోగ్యం

Oct 31, 2020 , 21:27:03

నల్ల ద్రాక్షను బ్లాక్‌ గ్రేప్స్‌ అంటారు. ఇవి మార్కెటోల్ విరివిగా లభిస్తాయి. ఈ నల్ల ద్రాక్ష మధ్య, ఉత్తర యూరప్, ఉత్తర ఆసియా దేశాల్లోని వాతావరణంలో పండుతాయి. వీటిలో విటమిన్స్, మినిరల్స్‌, యాంటీఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్, ఒమేగా-3 ఫాటీ యాసిడ్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దీంతో ఇవి మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. 

ప్రయోజనాలు..

  • వీటిని రోజూ తీసుకుంటే చర్మసమస్యలు తగ్గిపోతాయి.
  • కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
  • శరీరానికి కావాల్సిన పొటాషియం లభిస్తుంది.
  • మెదడు పనితీరు మెరుగుపడుతుంది.
  • మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి.
  • ఇమ్యూనిటీ పవర్‌ పెరుగుతుంది.
  • క్యాన్సర్‌,గుండె సంబంధ సమస్యలపై పోరాడుతుంది. 
  • హైబీపీ నియంత్రణలో ఉంటుంది.
  • ఇన్ఫెక్షన్ల బారినపడకుండా కాపాడుతుంది.
  • వీటిని క్రమంతప్పకుండా తీసుకుంటే ఎముకలు, దంతాలు పటిష్టమవుతాయి.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD