శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Health - Sep 05, 2020 , 21:44:08

అరటిపండుతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..!

అరటిపండుతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..!

హైదరాబాద్‌: ప్రతి సీజన్‌లో అందుబాటులో ఉండే అరటిపండుతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. అందుకే దీన్ని ప్రతిరోజూ తీసుకోవాలని డాక్లర్లు సూచిస్తున్నారు. ఇందులో కార్బోహైడ్రేట్స్‌, ప్రొటీన్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇది సులభంగా జీర్ణమవుతుంది. మలబద్ధకం ఉన్నవారికి మేలు చేస్తుంది. బలవర్ధకమైన పండు. అజీర్తిని పోగొట్టి, శరీరానికి మేలు చేస్తుంది. అందుకే హిందూ సంప్రదాయంలో ఏ శుభకార్యానికైనా ఈ పండునే ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని మరిన్ని ప్రయోజనాలు తెలుసుకుందాం..

  • ఇందులో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఎముకలు, దంతాలకు చాలా మంచిది. శరీర కండరాల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. 
  • అరటి పండులో ఉండే పోషకాలు మధుమేహం, ఆస్తమా, అధిక రక్తపోటు, క్యాన్సర్‌ను నివారిస్తాయి. 
  • కిడ్నీల ఆరోగ్యానికి ఇది ఉపకరిస్తుంది. వారానికి రెండు లేదా మూడు అరటి పండ్లు తినడం వల్ల మహిళలు కిడ్నీ సంబంధిత జబ్బుల బారిన పడే ముప్పు నుండి తప్పించుకోవచ్చు అని ఒక అధ్యయనంలో తేలింది.
  • ఇందులో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకానికి మంచి మందు.
  • కొవ్వులు తక్కువ మోతాదులో ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు తినవచ్చు. ఇందులో ఉండే పిండిపదార్థం కడుపు నిండిన భావన కలిగించి, ఆకలిని తగ్గిస్తుంది. 
  • ఇది పేగులను ఉత్తేజపరుస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 
  • ఎయిడ్స్‌ వైరస్‌పై పోరాడే శక్తి ఉంది. అరటిలో ఉండే ‘బాన్‌లెక్‌’ అనే రసాయనానికి ఎయిడ్స్‌ వైరస్‌పై పోరాడే శక్తి ఉందని ఓ రీసెర్చ్‌లో తేలింది. ప్రస్తుతం ఈ వైరస్‌ నిరోధానికి వాడుతున్న ‘టీ20, మారావిరాక్‌’ మందులతో సమానంగా ఈ రసాయనం పనిచేస్తుంది. లెక్టిన్‌ రసాయనం వైరస్‌ను శరీరంలో ప్రవేశించనీయకుండా అడ్డుకుని ఇన్‌ఫెక్షన్‌ను నిరోధిస్తుంది. 
  • ఇందులో ఉండే ట్రిప్టోపాన్ అనే అమైనో యాసిడ్ శరీరంలో ప్రవేశించగానే సెరటోనిన్‌గా మారుతుంది. తద్వారా ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ప్రశాంతతను కలుగజేస్తుంది. రాత్రిపూట పాలతో కలిపి తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo