పెద్దపేగు వ్యాధిగ్రస్తులకూ చక్కని ఆహారం


Mon,August 28, 2017 03:28 PM

చిన్న పల్లెటూరు నుంచి పట్టణాల వరకు అందరికీ అరటి పండు అందుబాటులో ఉంటుంది. అరటి పండులో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇది వయస్సుకు సంబంధం లేకుండా చిన్నా, పెద్దా ఎవరు తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లల ఎదుగుదలకు, వృద్ధుల్లో సత్తువకు, బీపీ, మధుమేహం, పెద్దపేగు బాధితులకు ఇది చక్కటి ఆహారం. ప్రస్తుత మార్కెట్‌లో డజనుకు రూ.40 నుంచి రూ.50 వరకు ధర పలుకుతుంది. అరటి పండ్ల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

అరటి పండు వల్ల ఉపయోగాలు..
* పిల్లలకు, వృద్ధులకు వ్యాధుల నుంచి కోలుకునే శక్తినిస్తుంది.
* పచ్చి అరటి పండులో కార్బొహైడ్రేట్లు స్టార్చ్ రూపంలో ఉంటాయి. పండుతున్న కొద్దీ ఇవి చక్కెరగా మార్పు చెందుతాయి. అందుకే పండుగా మారాక తియ్యగా ఉంటుంది. పూర్తిగా మగ్గిన అరటిలో 1-2శాతం చక్కర ఉంటుంది. రక్తపోటుతో బాధపడుతున్న వారికి చాలా విలువైన ఆహారం అరటి పండు. పెద్దపేగు వ్యాధిగ్రస్తులకూ చక్కని ఆహారం.
* అరటి పండులో కొవ్వు పదార్థం తక్కువ మోతాదులో ఉంటుంది.
* దీనిలో ఉండే పొటాషియం బీపీని తగ్గిస్తుంది. కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
* శరీరంలో విషపదార్థాలను తగ్గిస్తుంది.
* అరటి పండ్లలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆసిడ్ శరీరంలో ప్రవేశించగానే సెరటోనిన్‌గా మారి ఒత్తిడిని తగ్గిస్తుంది. అందుకే రాత్రి పూట పాలు, అరటి పండ్లు తీసుకుంటే నిద్ర బాగా పడుతుందని వైద్యులు చెబుతుంటారు.
* డైటింగ్ చేస్తున్న వాళ్లు ఒక పూట భోజనం మానేసి అరటి పండు తీసుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.

అరటిలో పోషక విలువలు...
* వంద గ్రాముల అరటిపండులో 70.1శాతం నీరుంటుంది
* ప్రోటీన్ 12 గ్రాములు ఉంటుంది
* కొవ్వు పదార్థాలు 0.3 గ్రాములు
* పిండి పదార్థాలు 27.2 గ్రాములు
* కాల్షియం 17 మిల్లీ గ్రాములు
* ఐరన్ 0.4 మిల్లీ గ్రాములు
* సోడియం 37 మిల్లీ గ్రాములు
* పొటాషియం 88 మిల్లీ గ్రాములు
* రాగి 0.16 మిల్లీ గ్రాములు
* మాంగనీస్ 0.2 మిల్లీ గ్రాములు
* జింక్ 0.15 మిల్లీ గ్రాములు
* క్రోమియం 0.004 మిల్లీ గ్రాములు
* కెరోటిన్ 78 మిల్లీ గ్రాములు
* సి విటమిన్ 7 మిల్లీ గ్రాములు
* థయామిన్ 0.008 మిల్లీ గ్రాములు
* నియాసిస్ 0.5 మిల్లీ గ్రాములు శక్తి 116 కిలో కేలరీలు కలిగి ఉంటుంది.

2730

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles