మంగళవారం 14 జూలై 2020
Health - May 13, 2020 , 14:46:19

అంజీర్ పండ్ల‌తో శృంగార స‌మ‌స్య‌ల‌కు చెక్‌..!

అంజీర్ పండ్ల‌తో శృంగార స‌మ‌స్య‌ల‌కు చెక్‌..!

అంజీర్‌ పండ్లు మ‌న‌కు మార్కెట్‌లో రెండు రూపాల్లో ల‌భిస్తాయి. ఒక సాధార‌ణ పండు రూపంలో, రెండోది డ్రై ఫ్రూట్ రూపంలో. అయితే ఏ రూపంలో వీటిని తిన్నా మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. అంజీర్‌ పండ్ల‌లో విట‌మిన్ ఎ, బి1, బి2, కాల్షియం, ఐర‌న్‌, పాస్ప‌ర‌స్‌, మెగ్నిషియం, సోడియం, పొటాషియం త‌దిత‌ర పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఈ క్ర‌మంలోనే నిత్యం అంజీర్ పండ్ల‌ను ఆహారంలో భాగం చేసుకుంటే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. అంజీర్ పండ్ల‌లో ఉండే ఐర‌న్ ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌ను పోగొడుతుంది. రక్తం బాగా త‌యార‌వుతుంది.

2. అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల శృంగార స‌మ‌స్య‌లు పోతాయి. దంప‌తులు శృంగారంలో చురుగ్గా పాల్గొంటారు.

3. హైబీపీతో బాధ‌ప‌డేవారు నిత్యం అంజీర్ పండ్ల‌ను తినాలి. వీటిలోఉండే పొటాషియం హైబీపీని త‌గ్గిస్తుంది. గుండె స‌మ‌స్య‌లు రాకుండా చూస్తుంది.

4. వేస‌విలో స‌హ‌జంగానే చాలా మందికి వేడి చేస్తుంటుంది. అలాంటి వారు ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే అంజీర్ పండ్ల‌ను తింటే శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. వేడి త‌గ్గుతుంది.

5. అంజీర్ పండ్ల‌ను తింటే నిద్ర‌లేమి స‌మ‌స్య పోతుంది. నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. అలాగే డ‌యాబెటిస్ అదుపులోకి వ‌స్తుంది. శ‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. ఎముక‌లు దృఢంగా మారుతాయి.

6. అంజీర్ పండ్ల‌ను తినడం వ‌ల్ల ప‌లు ర‌కాల క్యాన్స‌ర్లు రాకుండా చూసుకోవ‌చ్చ‌ని ప‌రిశోధ‌న‌లు వెల్ల‌డిస్తున్నాయి.


logo