ఆదివారం 29 నవంబర్ 2020
Health - Oct 29, 2020 , 22:46:59

ప్రతిరోజూ అంజీర్‌ తింటే ఇన్ని లాభాలా..!

ప్రతిరోజూ అంజీర్‌ తింటే ఇన్ని లాభాలా..!

హైదరాబాద్‌: అంజీర్‌కు మంచి మేడి, సీమ అత్తి, తినే అత్తి అనే పేర్లు కూడా ఉన్నాయి. అంజీర్‌ చెట్టు అందంగా, విశాలంగా పెరిగే చిన్న చెట్టు. ఇది సుమారు 15 నుంచి 30 అడుగుల ఎత్తు పెరుగుతుంది. ఈ చెట్టు బెరడు నున్నగా తెల్లని బూడిద రంగులో ఉంటుంది. గుడ్డు ఆకారం లేక శిఖరం ఆకారం లేక బేరి పండు ఆకారంలో ఉండే ఈ అంజీర్‌ పండు 1 నుంచి 4 అంగుళాల పొడవు ఉంటుంది. ఇరాన్, మెడిటెర్రానియన్ తీర ప్రాంతాలలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా అన్ని చోట్ల ఈ అంజీర్‌ చెట్లను పెంచుతున్నారు.  

ఆరోగ్య ప్రయోజనాలు..

 • అంజీర్‌లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మధుమేహ వ్యాధిని నియంత్రిస్తుంది.
 • బరువు తగ్గాలనుకునేవారికి ఇది ఎంతో సహాయపడుతుంది. అలాగని మరీ ఎక్కువ అంజీరలు తింటే బరువు పెరుగుతారు. అందువల్ల రోజుకు నాలుగైదుకి మించకుండా తింటే మంచిదే.
 • అంజీర్‌లో పొటాషియం ఎక్కువ, సోడియం తక్కువ. అందువల్ల వీటిని తింటే బీపీ తగ్గుతుంది. 
 • రాత్రంతా నీటిలో నానబెట్టిన డ్రై అంజీర్‌ను వాటర్‌తో సహా తింటే ఫైల్స్‌ పోతాయి.
 • ఇందులో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా, బలంగా మారుస్తుంది. ఆస్టియోపోరోసిస్‌ రాకుండా చూస్తుంది.  
 • అంజీర్‌లో ఉండే పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి మంచి చేస్తాయి.
 • ఇందులో పీచుపదార్థం ఎక్కువ ఉంటుంది గనుక మలబద్ధక సమస్య దూరమవుతుంది.
 • అల్జీమర్స్‌, మతిమరుపును తగ్గిస్తుంది.  
 • వెంట్రుకల ఆరోగ్యానికి అంజీర్‌ చక్కగా పనిచేస్తుంది. 
 • పురుషుల్లో లైంగిక సమస్యలకు అంజీర్‌ చక్కని పరిష్కారం. స్పెర్మ్ కౌంట్ పెంచేందుకు దోహదపడుతుంది. ఇది వయాగ్రాలా పనిచేస్తుంది. 
 • ఆస్తమా, దగ్గు, జ్వరంలాంటి అనారోగ్య సమస్యలకు చెక్‌పెడుతుంది.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.