శనివారం 04 జూలై 2020
Health - May 25, 2020 , 13:37:31

క్యాలరీలు బాగా ఖర్చవ్వాలంటే.. ఈ వ్యాయామాలు చేయాలి..!

క్యాలరీలు బాగా ఖర్చవ్వాలంటే.. ఈ వ్యాయామాలు చేయాలి..!

ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం వ్యాయామం చేయాలన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా మంది తమకు అనువైన వ్యాయామాలను నిత్యం చేస్తుంటారు. ఇక బరువు తగ్గాలనుకునే వారు కూడా భిన్న రకాల వ్యాయామాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఎవరైనా సరే.. కింద తెలిపిన పలు వ్యాయామాలు చేస్తే అధికంగా క్యాలరీలను ఖర్చు చేయవచ్చు. దీంతో అధిక బరువు త్వరగా తగ్గుతారు. మరి క్యాలరీలను అధికంగా ఖర్చు చేసే ఆ వ్యాయామాలు ఏమిటంటే...

1. కనీసం 30 నిమిషాల పాటు స్విమ్మింగ్ చేస్తే 180 నుంచి 266 క్యాలరీలు ఖర్చవుతాయి. అలాగే స్విమ్మింగ్ వల్ల శారీరక దృఢత్వం ఏర్పడుతుంది. అధిక బరువు తగ్గుతారు.

2. రాక్ క్లయింబింగ్ చేయడం వల్ల కూడా అధికంగా క్యాలరీలను ఖర్చు చేయవచ్చు. శరీరంలో అధికంగా క్యాలరీలు ఖర్చవుతాయి. శక్తి త్వరగా అయిపోతుంది. దీంతో శారీరక శ్రమ జరిగి చక్కని వ్యాయామం చేసినట్లవుతుంది. ఆరోగ్యంగా ఉండవచ్చు.

3. జాగింగ్ చేయడం వల్ల కూడా క్యాలరీలను అధికంగా ఖర్చు చేయవచ్చు. కనీసం 30 నిమిషాట పాటు జాగింగ్ చేస్తే సుమారుగా 400 క్యాలరీలు ఖర్చవుతాయి.

4. జంపింగ్ రోప్స్ వల్ల 30 నిమిషాలకు 300 నుంచి 444 క్యాలరీలను ఖర్చు చేయవచ్చు. దీంతో బరువు త్వరగా తగ్గుతారు.

5. సైకిల్ తొక్కడం వల్ల 30 నిమిషాలకు సుమారుగా 466 క్యాలరీలు ఖర్చవుతాయి. దీంతో శరీరానికి చక్కని వ్యాయామం అవుతుంది.

6. ఎరోబిక్స్ చేయడం వల్ల 30 నిమిషాలకు 400 క్యాలరీలను ఖర్చు చేయవచ్చు. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.


logo