బుధవారం 30 సెప్టెంబర్ 2020
Health - May 21, 2020 , 14:31:25

వికారంగా ఉందా..? ఈ చిట్కాలు పాటించండి..!

వికారంగా ఉందా..? ఈ చిట్కాలు పాటించండి..!

ఫుడ్ అల‌ర్జీలు, ఫుడ్ పాయిజ‌నింగ్, గ్యాస్ స‌మ‌స్య‌లు.. త‌ల‌నొప్పి, మోష‌న్ సిక్‌నెస్‌.. ఇంకా అనేక కార‌ణాల వ‌ల్ల కొంద‌రికి ఎప్పుడూ క‌డుపులో తిప్పిన‌ట్లుగా, వికారంగా అనిపిస్తుంటుంది. అయితే మ‌న ఇండ్ల‌లో ఉండే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందామా..!

* వికారంగా ఉండి వాంతి వ‌స్తున్న‌ప్పుడు వీలైనంత ఎక్కువగా నీరు తాగాలి. దీంతో శ‌రీరం డీహైడ్రేష‌న్‌కు గుర‌వకుండా ఉంటుంది. అలాగే జీర్ణాశ‌యంలో ఆమ్ల ర‌సాల ప్ర‌భావం త‌గ్గుతుంది. దీంతో వికారం నుంచి కొంత వ‌ర‌కు ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

* మ‌సాలాలు, కారం ఎక్కువ‌గా ఉన్న ప‌దార్థాలు, జంక్ ఫుడ్‌, నూనె ప‌దార్థాల‌ను తిన‌కుండా.. తేలిగ్గా జీర్ణ‌మ‌య్యే ఆహారాల‌ను తీసుకోవాలి. దీంతో వికారం త‌గ్గుతుంది.

* వికారానికి నిమ్మ‌కాయ‌లు అద్భుతంగా ప‌నిచేస్తాయి. ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా నిమ్మ‌ర‌సం క‌లుపుకొని తాగితే వికారం త‌గ్గుతుంది. అలాగే నిమ్మ‌కాయ‌ల్ని వాస‌న చూసినా వికారం నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు.

* కొద్దిగా అల్లంర‌సం తాగినా లేదా అల్లం ముక్క‌ను న‌మిలి మింగినా వికారం, వాంతులు నుంచి ఉపశమనం పొందవచ్చు.

* నిమ్మ‌ర‌సం, తేనె, అల్లం ర‌సం క‌లిపిన హెర్బ‌ల్ టీల‌ను తాగినా వికారం త‌గ్గుతుంది.

* వికారంగా ఉన్న‌ప్పుడు వీలైనంత వ‌ర‌కు ప‌డుకొనే ఉండాలి. క‌ద‌ల‌కూడ‌దు. అలాగే పుదీనా ఆకుల వాస‌న చూడాలి. దీంతో వికారం కొంత వ‌ర‌కు త‌గ్గుతుంది.


logo