ఆహ్లాదంతో పాటు ఆరోగ్యం కూడా..


Tue,August 7, 2018 10:02 AM

జీవకోటి మనుగడకు చెట్లే ఆధారమనడంలో ఏమాత్రం సందేహం లేదు. పుట్టింది మెదలు గిట్టినంత వరకు మొక్కలు అన్ని విధాల ఉపయోగ పడతాయి. నిత్యం మనం ఆరుబయట ఎదుర్కొంటున్న కాలుష్యం కంటే ఇంట్లో ఉండే కాలుష్యం దానికి పదిరెట్లు ఎక్కువ! అని చాలా మందికి తెలియదు. బయట కాలుష్యంలో కేవలం గంథకం, కార్బన్ మోనాక్సైడ్ మాత్రమే ఉంటుంది. కానీ మనం ఇళ్లలో వాడుకునే సర్ఫ్, పౌడర్లు, ఎయిర్ స్ప్రేలు, దోమల నివారణ మందులు, ఇళ్లు శుభ్రం చేసుకోడానికి వాడే ఫినాయిల్, వంటగ్యాస్ వాడే సమయంలో గాల్లోకి విడుదలయ్యే హానికర వాయువులు.. ఇలా చెప్పుకుంటూ పోతే బయటి కన్నా ఇళ్లలోనే మనం ఎక్కువ కాలుష్యాన్ని తెచ్చి పెట్టుకుంటున్నామని కొన్ని పర్యావరణ వేదికలు తెల్చి చెప్పాయి.

స్త్రీలు వాడే అన్ని సౌందర్య సాధనాలతో పాటు, బాడీ స్ప్రేల వల్ల కూడా ఇళ్లలోని గాలిలో బెంజిన్, ఫార్మాల్డిహైడ్, ట్రైక్లోరోఇథిలిన్ వంటి ప్రమాదకర రసాయనాలు చేరి తీవ్ర స్థాయిలో కలుషితమవుతుంది. కానీ ఈ సంగతి 99 శాతం మందికి తెలియదు. ఇలాంటి ప్రమాదకర రసాయన పూరిత వాయు కాలుష్యాన్ని 19 జాతులకు చెందిన కొన్ని మొక్కలు సమర్ధవంతంగా పీల్చుకొని స్వచ్ఛమైన గాలిని అందిస్తాయని వృక్ష శాస్త్రవేత్తలు, హరితహార నిపుణులు గుర్తించారు. ఈ మొక్కలన్నీ ఇంట్లోని చిన్న చిన్న కుండీల్లో పెంచుకోడానికే వీలున్నవే కావడం మరో విశేషం. ఇవి చూసేందుకు పిచ్చి మొక్కల్లా, గడ్డిజాతికి చెందినవిలాగా ఉన్నా.. గాలిలో ఉండే హానికరమైన రసాయనాలను పీల్చుకొని వడకట్టే ప్రత్యేకతను కల్గి ఉండటం పలు పరిశోధనల్లో శాస్త్రజ్ఞులను విస్మయ పరిచాయి. ఆ మొక్కలు ఏమిటో, అవి ఇంట్లో ఏయే రసాయనాలను, విష వాయువులను నిర్మూలిస్తాయో తెలుసుకుందాం.

కలబంద (అలోవెరా) : ఇంట్లోవాడే ఫినాయిల్, డిటర్జెంట్ల వల్ల ఉత్పన్నమయ్యే ఫార్మాల్డిహైడ్ అనే రసాయనాన్ని పీల్చుకుంటుంది.
వక్కమొక్క (ఏరికా) : గాలిలోని అన్ని రసాయనాలను పీల్చుకుంటుంది.
బేబి రబ్బర్ మొక్క : ఫార్మాల్డిహైడ్‌ను పీల్చుకొని అధిక మోతాదులో స్వచ్ఛమైన ఆక్సీజన్‌ను విడుదల చేస్తుంది.
రీడ్‌ఫాం : ట్రైక్లోరో ఇథిలిన్‌ను పీల్చుకుంటుంది. గాలిలోని తేమను స్థిరంగా ఉంచి ఇంటికి చల్లదనానిస్తుంది.
చైనాగ్రీన్స్ : బెంజీన్‌ను పీలుస్తుంది. ఆక్సీజన్‌ను అధికంగా అందిస్తుంది.
పిగ్మీఫాం : ఫ్లోర్ క్లీనర్స్‌లో ఉండే ైగ్లెలిన్ అనే రసాయనాన్ని పీల్చుకుంటుంది.
ఫైకస్ అల్లీ : గాల్లోని 10 రకాల కాలుష్య రసాయనాలను పీల్చుకుంటుంది.
చామంతి : క్యాన్సర్‌ను కలిగించే బెంజిన్ రసాయనాన్ని పీలుస్తుంది. ఈ మొక్క, పూలు బెడ్రూంలో ఉంచుకుంటే గాఢ నిద్ర పడుతుందని పరిశోధనలు రుజువుచేశాయి.
మనీప్లాంట్ : ఇది ఇంట్లో ఉంటే డబ్బు వస్తుందని, ఉన్న డబ్బు ఖర్చు కాదనే నమ్మకం ఉంది. కానీ ఇదెంత నిజమో తెలియదు. కార్బన్‌మోనాక్సైడ్, ఫార్మాల్డిహైడ్ కాలుష్యాన్ని ఇది అతి సమర్థవంతంగా నిర్మూలిస్తుంది.
డ్రాగన్ మొక్క : బెంజిన్, ట్రైక్లోరో ఇథిలిన్, ఫార్మాల్డిహైడ్‌లను వడగడుతుంది.
పీస్ లిల్లి : సర్ఫ్, డిటర్జెంట్లలోని బెంజిన్, ఎసిటోన్‌ల వంటి హానికర రసాయనాలను వడగడుతుంది. గాల్లో ఉండే ఫంగస్ స్పోర్‌లను కూడా ఇది వడగడుతుంది. బాత్రూం, కిచెన్ బయట, వాషింగ్ మిషన్‌ల వద్ద ఈ మొక్క ఉంచితే మంచిది.
ఫిలోడెండ్రాన్ : ఈ మొక్కను వేలాడే కుండీల్లో పెంచాలి. గాల్లోని ఫార్మాల్డిహైడ్‌ను వేగంగా పీల్చుకుంటుంది.
స్నేక్ ప్లాంట్ : నత్రజని సంబంధిత వాయువులను స్థీరికరణ స్థాయిలో ఉంచుతుంది.
అంబరిల్లా ప్లాంట్ : అధిక మోతాదులో బెంజిన్ విష స్వభావాన్ని తటస్థపరుస్తుంది.
స్పైడర్ ప్లాంట్ : పెద్ద మొత్తంలో ఫార్మాల్డిహైడ్‌ను క్షణాల్లో పీల్చేస్తుంది.
ఫిగ్ : గాల్లోని సమస్త హానికర కాలుష్య రసాయనాలను పీలుస్తుంది. అధిక మొత్తాల్లో ఆమ్లజనిని విడుదల చేస్తుంది.
డెర్మిన్ సెస్ : అన్ని రకాల వాయుకాలుష్యాన్ని అరికడుతుంది.
బోస్టర్ ఫెర్న్ : ఇది కాలుష్యపూరితమైన రసాయనాలతో నిండిన గాలిని శుద్ధి చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.
ఫెలేని యోప్సిస్ : ఇది గాలిని శుభ్రపర్చడంతో పాటు, గాలిని సువాసన భరితం చేస్తుంది.

1869
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles