బుధవారం 23 సెప్టెంబర్ 2020
Health - Apr 11, 2020 , 17:52:28

రాత్రిపూట కంటినిండా నిద్రపట్టాలంటే ఏం చేయాలి?

రాత్రిపూట కంటినిండా నిద్రపట్టాలంటే ఏం చేయాలి?

కంటి నిండా నిద్ర‌పోవాలి. క‌డుపు నిండా తిండి తినాలి అంటారు పెద్ద‌లు. ఇందులో ఏది కొర‌త ఉన్నా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కొంత‌మంది ప‌గ‌లు నిద్ర‌పోయి రాత్ర‌లు మేల్కొంటూ ఉంటారు. అదేమ‌న్నా అంటే నాకు నిద్ర ప‌ట్డడం లేదు అంటుంటారు. మ‌రికొంత‌మందేమో నిద్ర స‌మ‌యంలో భంగం క‌లుగుతుంది. అని ఇలా కార‌ణాలు చెబుతుంటారు. అందుకే ఎలాంటి ప‌రిస్థితుల్లో అయినా రాత్రి సుఖంగా నిద్ర పోవటం ఆరోగ్యానికి మంచిది. నిద్ర పట్టడానికి కొన్ని చిట్కాలు ఇదిగో..


పగటిపూట నిద్ర‌పోకూడ‌దు 

రాత్రి పడుకోలేకపోతే, పగటిపూట నిద్రపోకుండా ఉండాలి. ఒక‌రోజు ఈ ప‌ద్ధ‌తిని పాటిస్తే ఇలానే కొన‌సాగుతుంది. ప‌గ‌లు నిద్ర‌పోకుండా ఉండాలంటే బెడ్ ద‌గ్గ‌ర‌కి వెళ్ల‌కుండా ఉండాలి. బెడ్‌షీట్‌, దిండుల‌కు దూరంగా ఉంటే చాలు.

గ్యాడ్జెట్స్‌కు దూరంగా

నిద్రపోయే ముందు మీ స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లను ఉపయోగించడం త‌గ్గించాలి. ఎందుకంటే అవి మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. ఇటువంటి కార్యకలాపాలు మెదడును కూడా ఉత్తేజపరుస్తాయి, తద్వారా మీరు నిద్రపోవటం కష్టమవుతుంది.

ఆహారం

పడుకునే ముందు ఆహారంపై శ్రద్ధ వహించాలి. రాత్రి స‌మ‌యంలో క‌డుపు తేలిక‌గా ఉండాలి. రాత్రి స‌మ‌యంలో కాఫీ, టీ వంటి వాటికి దూరంగా ఉండాలి. దీని ప్రభావం గంటల తరబడి ఉంటుంది.  కాబట్టి నిద్రపోవడం కష్టమవుతుంది. నిద్రపోయే ముందు వెచ్చని పాలు తాగితే మంచిది.

మద్యానికి దూరం

పడుకునే ముందు మద్యం సేవించడం మానుకోండి ఎందుకంటే అది నిద్రకు భంగం క‌లిగిస్తుంది. ఇది స్లీప్ అప్నియా వంటి సమస్యలను పెంచుతుంది. గురక మొదల‌వుతుంది.

ద్యానం చేయాలి

నిద్రపోయే ముందు మీ మనస్సును ప్ర‌శాంతంగా ఉంచుకోండి. ద్యానం చేయ‌డానికి ప్రయత్నించండి. నిద్ర‌కు ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. ఎందుకంటే వేడినీరు నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తాయి. 

సౌకర్యవంతమైన బెడ్‌

నిద్ర‌కు పోవాల‌నుకుంటున్న గ‌ది చ‌ల్ల‌గా ఉండేలా చూసుకోవాలి. మాట్రెస్‌, దిండు శుభ్రంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. వెన్నునొప్పి ఉన్న‌వాళ్లు కింద‌ప‌డుకోవ‌డం మంచిది.

వ్యాయామం

క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అలా అని నిద్ర‌కు ముందు వ్యాయామం చేయకూడదు ఎందుకంటే ఇది నిద్ర రుగ్మతలకు కారణం కావచ్చు. ఉదయం వ్యాయామం చేయడం వల్ల నిద్రలేమి, స్లీప్ అప్నియా వంటి స‌మ‌స్య‌ల నుంచి ఉపశమనం పొందవచ్చు.

నీరు ఎక్కువగా తాగొద్దు

రాత్ర‌లు నీరు ఎక్కువ‌గా తాగ‌కూడ‌దు. ఎందుకంటే నిద్ర‌లో టాయిలెట్ ప్ర‌భావం చూపుతుంది. దీనివ‌ల్ల నిద్ర‌కు భంగం క‌లుగుతుంది.


logo