హాయిగా నిద్ర‌పోవాలంటే.. ద్రాక్ష పండ్ల‌ను తినండి..!


Sat,November 17, 2018 05:38 PM

హాయిగా నిద్ర‌పోవాల‌ని కోరుకుంటున్నారా ? రాత్రి పూట అస్స‌లు నిద్ర ప‌ట్ట‌డం లేదా ? అయితే ద్రాక్ష పండ్ల‌ను తినాల‌ని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. ద్రాక్షలో నిద్రకు సహాయపడే మెలటోనిన్‌ అనే హార్మోన్‌ ఉంటుంది. అలాగే ద్రాక్ష పండ్లలో గుండె ఆరోగ్యానికి ఉపయోగపడే యాంటీ ఆక్సిడెంట్లు అయిన‌ పాలీఫినోల్స్, ఫ్లేవనాయిడ్స్ అధిక మొత్తంలో ఉన్నాయని వారు చెబుతున్నారు. అదేవిధంగా పాలకూరలో అధికంగా ఉండే పొటాషియం, క్యాల్షియం కూడా రాత్రిపూట హాయిగా నిద్రపోవడానికి సహకరిస్తాయ‌ట‌. అంతేకాదు, ప్రతిరోజూ పాలకూర తినే వాళ్లకు ఒత్తిడి, తలనొప్పి, కండరాలు, కీళ్లనొప్పి దరిచేరవ‌ని వైద్యులు తెలియజేస్తున్నారు. ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల‌ ఎలాంటి సమస్యలు లేకుండా సుఖంగా నిద్రపోవచ్చు.

ఈ క్ర‌మంలోనే ఒక కప్పు నీటిలో రెండు పాలకూర ఆకులు వేసి ఐదు నిమిషాలు మరిగించాలి. చల్లారేదాకా ఉంచి తర్వాత వడగట్టి చక్కెర కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నిద్రపోవడానికి అరగంట ముందు తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇది న‌చ్చ‌క‌పోతే 200 ఎంఎల్ మోతాదులో ద్రాక్ష పండ్ల ర‌సం (చ‌క్కెర క‌ల‌ప‌కుండా) లేదా కొన్ని ద్రాక్ష పండ్ల‌ను నిద్ర పోవ‌డానికి గంట ముందు తింటే సుఖంగా నిద్ర‌పోవ‌చ్చని, నిద్ర లేమి స‌మ‌స్య దూర‌మ‌వుతుంద‌ని వైద్యులు చెబుతున్నారు.

4233

More News

VIRAL NEWS