శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Health - May 15, 2020 , 15:07:52

అర‌టిపండు తిని పాలు తాగుతున్నారా?

అర‌టిపండు తిని పాలు తాగుతున్నారా?

చాలామంది పాలు, అరటిపండు ఒకేసారి తీసుకుంటారు.  ఇలా చేయ‌డం ముమ్మాటికి త‌ప్పు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు వైద్యులు. ఈ రెండింటినీ విడివిడిగా కొంత గ్యాప్‌తో తీసుకుంటే మంచిదంటున్నారు. 

1. పండ్లంటే అందరికీ ఇష్టమే. ముఖ్యంగా సీజ‌న‌ల్ ఫ్రూట్స్, పాలు క‌లిస్తే ఇక చెప్పేదేముంది. ఇది ఎన్నో పోష‌కాల‌తో క‌లిగున్న ఆహారం. వండుకోవ‌డానికి క‌ష్టంగా ఉన్న‌ప్పుడు స్మూతీ ట్రై చేయ‌డం మంచిది. ఉద‌యం పూట, సాయంత్రం వేళ‌లో ఇది అద్భుతంగా ప‌నిచేస్తుంది. అయితే ఈ స్మూతీని పాల‌తో బ‌దులు పెరుగుతో ట్రై చేస్తే ఇంకా మంచిది. ఇలా చేయ‌డం వ‌ల్ల రుచితోపాటు ఆరోగ్యంగా కూడా ఉంటారు.

2. పాల‌లో లేని పోష‌కాలు అర‌టిపండులో ఉంటాయి. ఈ రెండింటినీ క‌లిపి తీసుకుంటే కావాల్సిన పోష‌కాలు వ‌స్తాయి అనుకుంటారు. ఇలా ఎప్ప‌టికీ చేయ‌కూడ‌ట. ఈ రెండింటినీ ఎప్ప‌టికీ తీసుకోకూడ‌దట. ఇలా చేయ‌డం వ‌ల్ల విరోచినాలు, సైన‌స్‌, అస్త‌మా, ద‌గ్గు, జ‌లుబు, వాంతులు లాంటి స‌మ‌స్య‌లు ఎదుర‌య్యే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. 

3. బాడీ బిల్డ‌ర్స్‌కి అయితే ఈ కాంబినేష‌న్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుందంటున్నారు న్యూట్రిష‌నిస్ట్స్‌. ఆస్త‌మా ఉన్న‌వారు ఈ రెసిపీ జోలికి అస‌లు వెళ్ల‌కూడ‌దు.

4. అర‌టి, పాలు రెండూ ఒక‌సారి తీసుకోలేన‌ప్పుడు విడివిడా తీసుకోవ‌చ్చు. 20 నిమిషాల వ్య‌వ‌ధిలో ఈ రెండింటినీ తీసుకోవ‌చ్చు. ముందు పాలు తాగి, అర‌గంట త‌ర్వాత అర‌టిపండు తింటే స‌రి. అర‌టిపండు విడిగా తిన‌లేనంటే పెరుగుతో క‌లిపి తీసుకుంటే మంచిది.logo