బుధవారం 08 ఏప్రిల్ 2020
Health - Feb 29, 2020 , 16:00:53

గ్రీన్‌ టీతో ఫ్యాటీ లివర్‌ సమస్యకు చెక్‌..!

గ్రీన్‌ టీతో ఫ్యాటీ లివర్‌ సమస్యకు చెక్‌..!

నిత్యం గ్రీన్‌ టీ తాగడంతోపాటు వ్యాయామం చేస్తే ఫ్యాటీ లివర్‌ సమస్యకు చెక్‌ పెట్టవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మేరకు అమెరికాలోని ది పెన్సిల్వేనియా స్టేట్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు గ్రీన్‌ టీ నుంచి తీసిన పలు పదార్థాలతో ఎలుకలపై చేసిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఈ క్రమంలో వారు గ్రీన్‌ టీ వల్ల ఫ్యాలీ లివర్‌ సమస్య నుంచి బయట పడవచ్చని చెబుతున్నారు. 

సాధారణంగా ఫ్యాటీ లివర్‌ సమస్య రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి నాన్‌ ఆల్కహాలిక్‌, రెండోది ఆల్కహాలిక్‌. అంటే.. ఒకటి.. ఆల్కహాల్‌ తాగని వారిలో వచ్చేది. రెండోది.. ఆల్కహాల్‌ బాగా తాగే వారిలో వచ్చేది. ఏ సమస్య వచ్చినా గ్రీన్‌ టీని తీసుకుంటే దాన్నుంచి బయట పడవచ్చని సదరు సైంటిస్టులు చెబుతున్నారు. అయితే గ్రీన్‌ టీకి తోడుగా నిత్యం వ్యాయామం కూడా చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయని వారు అంటున్నారు. 


logo