గురువారం 09 జూలై 2020
Health - May 14, 2020 , 19:51:45

అల్లంతో జుట్టు సమస్యలకు చెక్!

అల్లంతో జుట్టు సమస్యలకు చెక్!

డ‌బ్బు లేక‌పోతే స‌మాజం ఎంత చిన్న‌చూపు చూస్తుందో తెలీదు కాని, జుట్టు లేక‌పోతే మాత్రం అంత‌క‌న్నా చిన్నచూపు చూస్తుంది. ఇప్పుడున్న‌ లైఫ్‌స్టైల్‌, కాలుష్యం, వాతావ‌ర‌ణం కార‌ణంగా జుట్టు స‌మ‌స్య‌లు అనేవి అందిర‌లోనూ ఉంటున్నాయి. అయినా జుట్టు లేద‌నే బాధ నిత్యం త‌ల‌చివేస్తూనే ఉంటుంది. ఇది కాన్ఫిడెంట్ లెవ‌ల్స్‌ను త‌గ్గిస్తుంది. వంటింట్లో ఉండే అల్లంతోనే ఈ స‌మ‌స్య‌కు చెక్ పెట్టొచ్చు అంటున్నారు వైద్యులు. అదెలానో చూద్దాం.

- అల్లం రసాన్ని జుట్టుకు పట్టించాలి. అరగంటపాటు జుట్టును ఆరనివ్వాలి. ఆ తర్వాత తేలిక‌పాటి షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి మూడుసార్లు ఇలా చేస్తే జుట్టు క్రమంగా బ‌లంగా త‌యార‌వుతుంది.

- అలాగే అల్లం నూనె (ginger oil)ను కూడా జుట్టుకు పట్టిస్తే ఎంతో మేలు జరుగుతుంది.

- అల్లం ముక్కలో మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, చాలా విటమిన్లు ఉంటాయి. అవి జుట్టును మెరిసేలా చెయ్యడమే కాదు... బలంగా, ఒత్తుగా అయ్యేలా చేస్తాయి.

- అల్లం ముక్కలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మన జుట్టుపై వాలే విషవ్యర్థాల్ని తరిమికొడతాయి.

- చాలామంది నిమ్మరసాన్ని జుట్టుకు పట్టిస్తారు. అయితే, నిమ్మరసంలో యాసిడ్ ఉంటుంది. తరచుగా నిమ్మరసాన్ని జుట్టుకు పట్టిస్తే శిరోజాలు పాడయ్యే ప్రమాదం ఉంటుంది. 


logo