ప‌వ‌ర్‌ఫుల్ యాంటీ బ‌యోటిక్‌గా ప‌నిచేసే అల్లం..!


Sat,December 31, 2016 04:32 PM

మ‌న‌కు ప్రకృతి ప్రసాదించిన వనమూలికల్లో అలం కూడా ఒకటి. భారతీయులు దాదాపు 5వేల‌ సంవత్సరాల నుంచి అల్లంను వంటల్లోనే కాదు అనేక ఔషధాల తయారీల్లో కూడా ఉపయోగిస్తున్నారు. అల్లంలో మ‌న శ‌రీరానికి ఎంతో అవ‌స‌ర‌మైన కీల‌క పోషకాలున్నాయి. దీంతో ప‌లు ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఇట్టే న‌యం చేసుకోవ‌చ్చు కూడా. ఈ క్ర‌మంలో అల్లం వల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్ స‌మృద్ధిగా ఉన్నాయి. ఇవి స‌హజ సిద్ధ‌మైన యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ వైర‌ల్‌, యాంటీ బ‌యోటిక్ ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉండ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలోని ఇన్‌ఫెక్ష‌న్ల‌ను తొల‌గిస్తాయి. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి.

2. ర‌క్తం శుద్ధి అవుతుంది. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. ర‌క్త నాళాల్లో కొలెస్ట్రాల్‌, ర‌క్తం గ‌డ్డ‌కుండా చూస్తుంది. దీంతో గుండె సంబంధ స‌మ‌స్య‌లు రావు.

3. నిత్యం అల్లం ర‌సం తాగుతూ ఉంటే కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. క‌డుపులో ఉండే అల్స‌ర్లు మానిపోతాయి. నోటి దుర్వాస‌న‌ను తొలగించుకునేందుకు అల్లం ర‌సం ఉప‌యోగ‌ప‌డుతుంది. నోటిలో చేరిన హానిక‌ర‌మైన బాక్టీరియా కూడా తొల‌గిపోతుంది. దంతాలు దృఢంగా మారుతాయి.

4. షుగ‌ర్ వ్యాధి ఉన్న వారికి అల్లం ఎంత‌గానో మేలు చేస్తుంది. నిత్యం అల్లం ర‌సాన్ని ఉద‌యం, సాయంత్రం భోజ‌నానికి ముందు తీసుకుంటూ ఉంటే దాంతో షుగ‌ర్ అదుపులోకి వ‌స్తుంది.

5. అల్లం ర‌సం తాగితే తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. ఆక‌లి లేని వారు అల్లం ర‌సం తాగ‌డం మంచిది.

6. ద‌గ్గు, జ‌లుబు వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో అల్లం ర‌సం చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది.

7. అల్లం ముక్క‌ల‌ను కొన్నింటిని మ‌రుగుతున్న నీటిలో వేసి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అనంత‌రం ఆ నీటిలో కొంత తేనె క‌లుపుకుని తాగితే ప‌వ‌ర్‌ఫుల్ యాంటీ బ‌యోటిక్‌గా ప‌నిచేస్తుంది. శ‌రీరంలోని ఇన్‌ఫెక్ష‌న్లు న‌యం అవ‌డ‌మే కాదు, ద‌గ్గు, జ‌లుబు వంటి స‌మ‌స్య‌ల నుంచి వెంట‌నే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. క‌ఫం పోతుంది.

8. పైన చెప్పిన విధంగానే అల్లంను వేడి నీటిలో వేసి మ‌రిగించాక అందులో కొన్ని చుక్క‌ల నిమ్మ‌ర‌సం వేసి క‌లుపుకుని తాగితే ఒళ్లు నొప్పులు త‌గ్గుతాయి.

9. ఉద‌యాన్నే అల్లం ర‌సం లేదా అల్లంను అలాగే డైరెక్ట్‌గా తింటే గ్యాస్ స‌మ‌స్య‌లు పోతాయి. జీర్ణాశ‌యం శుభ్ర‌మ‌వుతుంది.

10. రెండు టీస్పూన్ల అల్లం ర‌సంలో అంతే మోతాదులో నిమ్మ‌ర‌సం క‌లుపుకుని అందులో ఉప్పు వేసి తాగితే క‌డుపు నొప్పి త‌గ్గుతుంది.

5784
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS